Viral Video : బ్లూ రోజ్ ఇచ్చింది ఎవరో కానీ.. కావ్య పాప ఫేస్ మాత్రం వెయ్యి వాట్ల బల్బులా వెలుగుతుందిగా

Viral Video : ఎస్‌ఆర్‌హెచ్ ఘన విజయం తర్వాత స్టేడియంలో ఎమోషనల్, ఎంటర్‌టైనింగ్ సన్నివేశాలు హైలైట్‌గా మారాయి. అభిమానులు ఆనందంలో మునిగిపోయిన సమయంలో, ఒక ఫ్యాన్ కావ్యా మారన్‌కు ప్రత్యేకంగా నీలి గులాబీ అందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు, మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ పడిన క్షణంలో కావ్యా ఇచ్చిన రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : బ్లూ రోజ్ ఇచ్చింది ఎవరో కానీ.. కావ్య పాప ఫేస్ మాత్రం వెయ్యి వాట్ల బల్బులా వెలుగుతుందిగా
Kavya Maran (1)

Updated on: Apr 14, 2026 | 1:13 PM

Viral Video : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేసింది. అప్రతిహతంగా దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) విజయ పరంపరకు బ్రేక్ వేసి, హైదరాబాద్ మైదానంలో ఆరెంజ్ ఆర్మీ జెండా పాతారు. అయితే, గ్రౌండ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఒకెత్తయితే, గ్యాలరీలో ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యా మారన్ రియాక్షన్స్ ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. తాజాగా రాజస్థాన్‌పై గెలిచిన తర్వాత కావ్యాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమెకు ఒక గుర్తు తెలియని వ్యక్తి గులాబీ పువ్వు ఇచ్చి సర్ ప్రైజ్ చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆ బ్లూ రోజ్ వెనుక సీక్రెట్

రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ 55 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన తర్వాత కావ్యా మారన్ పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ఒక అభిమాని ఆమెకు నీలి రంగు గులాబీని (Blue Rose) ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సాధారణంగా నీలి గులాబీ అనేది అరుదైన ప్రేమకు, గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. కావ్యా ఆ పువ్వును చిరునవ్వుతో స్వీకరించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వ్యక్తి ఎవరనేది తెలియకపోయినా, కావ్యాపై అతనికి ఉన్న అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైభవ్ సూర్యవంశీ వికెట్ – కావ్య కేకలు

ఈ మ్యాచ్‌లో కేవలం కావ్యా మారన్ నవ్వు మాత్రమే కాదు, ఆమె ఆవేశం కూడా హైలైట్ అయింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వికెట్ పడగానే కావ్యా తన సీటు నుంచి లేచి ఎగిరి గంతేసింది. ప్రఫుల్ హింగే వేసిన మొదటి బంతికే వైభవ్ క్యాచ్ అవుట్ అవ్వడంతో కావ్యా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన టీమ్ పాయింట్ల పట్టికలో పైకి దూసుకుపోతుండటంతో ఆమె ఫుల్ జోష్‌లో కనిపించారు.

రాజస్థాన్ విజయాలకు బ్రేక్

గత నాలుగు మ్యాచ్‌లుగా వరుస విజయాలతో ఊపుమీద ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను హైదరాబాద్ జట్టు కట్టడి చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి 55 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసులో తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ గెలిచిన ప్రతిసారి కావ్యా మారన్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవ్వడం ఐపీఎల్‌లో ఒక ఆనవాయితీగా మారిపోయింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us