కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్‌పై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అరంగేట్ర టెస్ట్‌లోనే శ్రేయాస్ అయ్యర్ మానసిక దృఢత్వంతో ఆకట్టుకున్నానని అన్నాడు. తొలి రోజు 75 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించడంలో అయ్యర్ పట్టుదల, దృఢనిశ్చయం కనిపించిందని పేర్కొన్నాడు. గురువారం సునీల్ గవాస్కర్ నుంచి టెస్ట్ క్యాప్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ 7 బౌండరీలు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయ్యర్ 5వ వికెట్‌కు రవీంద్ర జడేజాతో కలిసి అజేయంగా 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. పుజారా, రహానె త్వరగా ఔటైనా ఈ ద్వయం మొదటి రోజు ఇండియాను బలమైన స్థితిలో నిలబెట్టిందని లక్ష్మణ్ చెప్పాడు. “అయ్యర్ న్యూజిలాండ్ స్పిన్నర్లకు అలవాటు పడటానికి కొంత సమయాన్ని వెచ్చించాడు. అయ్యర్ తన సహజమైన దూకుడు ఆటను ఆడాడు. అరంగేట్రంలో అతను ఏ దశలోనూ నిర్లక్ష్యంగా కనిపించలేదు.” అని పేర్కొన్నాడు.
“శ్రేయాస్ అయ్యర్ రెండు సంవత్సరాల క్రితం తన చివరి ఫస్ట్-క్లాస్ గేమ్ ఆడాడు. ఏ యువకుడికైనా కఠినమైన సవాలు ఏమిటంటే, వైట్-బాల్ నుండి రెడ్-బాల్ క్రికెట్‌కు మైండ్‌సెట్‌ను మార్చడం. అతను ఈ విషయంలోనూ రాజీపడలేదు, అతను ముంబై లేదా ఇండియా A కోసం ఆడినట్లుగానే ఆడటానికి బయలుదేరాడు. ఒత్తిడిని ఎదుర్కొన్న విధానం బాగుంది. అతను ఢిల్లీ క్యాపిటల్స్ కోసం, వైట్-బాల్ క్రికెట్‌లో భారతదేశం కోసం ఆడాడు. ఒక యువకుడు తన అరంగేట్రంలోనే అవకాశాన్ని చేజిక్కించుకోవడం దేశానికి గొప్ప వార్త, ”అని లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు. “అయ్యర్ భారీ షాట్లు ఆడటానికి వెనుకాడడు, అది అతని సహజమైన ఆట. స్పిన్నర్లను అతను ఎదుర్కొన్న విధానం అద్భతం. అని లక్ష్మణ్ వివరించాడు. అయ్యర్ ఆట ఏ విధంగానూ వన్ డైమెన్షనల్ కాదని, 5వ స్థానంలో అతని ప్రదర్శన భారత్‌కు శుభవార్త అని మాజీ భారత బ్యాటర్ చెప్పాడు.
“దూకుడు క్రికెట్ ఆడటానికి ఇష్టపడే శ్రేయాస్ అయ్యర్ వంటివారు ఎవరైనా, కొన్నిసార్లు ఆ షాట్లు నిర్లక్ష్యంగా ఉంటాయి, అతను దూకుడు అని నేను అనుకున్నాను. జెమీసన్, సౌతీ మంచి డెలివరీలు వేసినప్పుడల్లా, అతను గౌరవించాడు. అతను డైమెన్షనల్ క్రికెట్ మాత్రమే ఆడాడని కాదు.” అని చెప్పాడు. ఒకరు టీ20 తరం నుండి వచ్చినా పర్వాలేదు, అంతిమంగా ముఖ్యమైనది అత్యున్నత స్థాయిలో రాణించాలంటే మంచి స్వభావమే అవసరం.” అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
Read Also.. IND vs NZ: బంతి అలా వస్తుందని అనుకోలేదు.. జేమీసన్ బౌలింగ్‌పై గిల్ స్పందన..