అనుకోని ఉపద్రవం వచ్చి పడడంతో ఆటగాళ్లు మైదానం నుంచి పరుగులు తీశారు. దీంతో కాసేపు ఆటను ఆపాల్సి వచ్చింది. వర్షం లేదా బ్యాడ్ వెదర్ కారణంగా క్రికెట్ ఆట తరచుగా ఆగిపోవడం చాలాసార్లు చూశాం. తాజాగా ఇలాంటి సంఘటనే వెల్లింగ్టన్ టెస్ట్ మొదటి రోజు కూడా కనిపించింది. వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బలమైన గాలులు రావడంతో ఆటను నిలిపివేశారు. కేన్ విలియమ్సన్ స్ట్రైక్‌లో ఉన్నప్పుడు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఈ సంఘటన జరిగింది. అయితే అకస్మాత్తుగా చాలా బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. దిగ్గజ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గాలి వేగంతో పిచ్‌పై నిలవలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
బలమైన గాలులకు ఆటగాళ్ల టోపీలు, కళ్లద్దాలు కూడా ఎగిరిపోయాయి. అంపైర్లు గ్రౌండ్‌లో నిలబడడం కూడా కష్టంగా మారింది. ఈ ఆకస్మిక తుఫానుతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. వెల్లింగ్టన్‌లో ఈ తుఫాను వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతకుముందు వెల్లింగ్టన్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. నేల తడిగా ఉండటంతో తొలి సెషన్ ఆట రద్దైంది. ఆ తర్వాత ఆలమొదలైంది. శ్రీలంక టాస్ గెలిచి, న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆతిథ్య జట్టుకు లాథమ్, కాన్వే 87 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో శుభారంబాన్ని అందించాడు. ఆ తర్వాత 21 పరుగులు మాత్రమే చేసిన టామ్ లాథమ్ తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
మరోవైపు, డెవాన్ కాన్వే దూకుడుగా ఆడాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 108 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 13 ఫోర్లు వచ్చాయి. ఈ ఆటగాడి సగటు 72 కంటే ఎక్కువగా ఉంది. అయితే ధనంజయ్ డిసిల్వా వేసిన బంతికి అతను వికెట్ కోల్పోయాడు. టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ముందంజలో నిలిచింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో చివరి బంతికి న్యూజిలాండ్ విజయం సాధించింది. ఆ విజయంతో టీమ్ ఇండియా కూడా లాభపడింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..