వరల్ద్‌కప్‌లో విలియమ్సన్‌ సరికొత్త రికార్డ్!

| Edited By:

Jul 14, 2019 | 5:43 PM

ఐసీసీ వరల్ద్‌కప్ 2019లో భాగంగా న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను(578) ఈ రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకూ శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్ధనే పేరిట ఈ రికార్డు ఉండేది. 2007 ప్రపంచకప్‌లో మహేలా 11 ఇన్నింగ్‌ల్లో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలతో మొత్తం 548 పరుగులు సాధించాడు. తాజాగా కేన్‌ అతనిని […]

వరల్ద్‌కప్‌లో విలియమ్సన్‌ సరికొత్త రికార్డ్!
Follow us on

ఐసీసీ వరల్ద్‌కప్ 2019లో భాగంగా న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను(578) ఈ రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకూ శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్ధనే పేరిట ఈ రికార్డు ఉండేది. 2007 ప్రపంచకప్‌లో మహేలా 11 ఇన్నింగ్‌ల్లో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలతో మొత్తం 548 పరుగులు సాధించాడు. తాజాగా కేన్‌ అతనిని దాటి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అతను రెండు శతకాలు సాధించాడు.