Kane Williamson: మూడోసారి తండ్రైన కివీస్ కెప్టెన్.. మహాలక్ష్మి పుట్టడంతో కేన్ మామ ఇంట్లో వెల్లివెరిసిన ఆనందం

న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి సారా రహీమ్ ఒక పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది. కేన్ దంపతులకు ఇది మూడో సంతానం. వీరికి ఇది వరకే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మహాలక్ష్మి అడుగుపెట్టడంతో కేన్ మామ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది

Kane Williamson: మూడోసారి తండ్రైన కివీస్ కెప్టెన్.. మహాలక్ష్మి పుట్టడంతో కేన్ మామ ఇంట్లో వెల్లివెరిసిన ఆనందం
Kane Williamson

Updated on: Feb 28, 2024 | 1:41 PM

న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి సారా రహీమ్ ఒక పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది. కేన్ దంపతులకు ఇది మూడో సంతానం. వీరికి ఇది వరకే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మహాలక్ష్మి అడుగుపెట్టడంతో కేన్ మామ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్. ‘ఇకపై మూడు..ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయికి స్వాగతం. మీ సురక్షిత రాక, ముందుకు సాగిన ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు’ అంటూ తన ఇన్ స్టా గ్రామ్‌ లో పోస్ట్ షేర్ చేశాడు విలియమ్సన్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. స్టార్ క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కేన్ మామకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్ చూసిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘కంగ్రాట్స్ లెజెండ్’ అని విష్ చేశాడు. కేన్ విలియమ్సన్, సారా రహీమ్‌లకు ఇప్పుడు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు 2015 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే వారు ఇప్పటివరకు అధికారికంగా వివాహం చేసుకోలేదు. శ్రీలంక స్టార్ క్రికెటర్ దినేష్ చండిమాల్ కూడా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అతని ఇంట్లో పెద్ద వేడుక కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కకాగా ఫిబ్రవరి 29 నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు వెల్లింగ్టన్‌లో జరగనుంది. కేన్ విలియమ్సన్ కూడా ఈ టెస్టులో ఆడనున్నాడు. ఈ న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టు సిరీస్‌లో అతను 2 సెంచరీలు సాధించాడు. హోం గ్రౌండ్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ 20 సిరీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనుకుంటోంది న్యూజిలాండ్ టీమ్‌.

ఇవి కూడా చదవండి

బిడ్డతో కేన్ విలియమ్సన్..

కేన్ సతీమణి సారా రహీమ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..