ఆర్‌సీబీకి వరుసగా ఆరో ఓటమి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ ఆఖరి వరకూ పోరాడి మరోసారి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సౌతీ వేసిన తొలి ఓవర్‌లో ధావన్(0) నేగీకి […]

ఆర్‌సీబీకి వరుసగా ఆరో ఓటమి!

Edited By:

Updated on: Apr 07, 2019 | 7:52 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ ఆఖరి వరకూ పోరాడి మరోసారి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

సౌతీ వేసిన తొలి ఓవర్‌లో ధావన్(0) నేగీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి.. పృథ్వీషా ఇన్నింగ్స్ నిర్మించుకుంటూ వెళ్లాడు. వీళ్లిద్దరూ కలిసి రెండో వికెట్‌కి 68 పరుగులు జోడించారు. అయితే పవన్ నేగీ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి షా(28) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కొలిన్ ఇన్‌గ్రామ్(22) మొయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. అయినప్పటికీ శ్రేయాస్ అయ్యర్ పట్టువదలలేదు. 49 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 67 పరుగులు చేసి అర్థశతకం సాధించి ఔట్ అయ్యాడు. మరోవైపు రిషబ్ పంత్‌ కూడా అయ్యర్‌కు మంచి సహకారం అందించాడు. ఆఖర్లో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయినా.. ఫలితం మాత్రం ఢిల్లీకి అనుకూలించింది. ఢిల్లీ 18.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.