Kagiso Rabada Auction Price: దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా IPL 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ అతను 8.14 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. రబాడాను ఢిల్లీ నిలబెట్టుకోలేదు. దీంతో ఈ ఏడాది వేలంలోకి వచ్చాడు. 2017లో ఢిల్లీ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 వేలంలో ఈ ఆటగాడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలొకొంది. చివరకు పంజాబ్ కింగ్స్ టీం రూ. 9.25 కోట్లకు దక్కించుకుంది.
నాలుగేళ్ల తర్వాత సరికొత్తగా.. రెండు కొత్త జట్లతో ముస్తాబైన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో (IPL 2022 Auction) 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో 370 మంది భారతీయులు కాగా, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత్ తర్వాత అత్యధికంగా 47 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుంచి వేలంలో నిలిచారు. ఇక 590 మంది ఆటగాళ్లలో 228 మంది ఆటగాళ్లు ఇంతకు ముందు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. అదే సమయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా అరంగేట్రం చేయని ఆటగాళ్లు 335 మంది ఈ వేలంలో ఉన్నారు. తొలి రోజు 161 మంది క్రికెటర్లు అందుబాటులో ఉంటారు.