Ipl 2022 Auction: యశ్‌.. కంగారు పడకు.. ఈసారి నేను క్రీజులోనే ఉన్నాను.. అశ్విన్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికిన బట్లర్‌..

|

Feb 14, 2022 | 10:10 AM

Ipl 2022 Auction: అది 2019 ఐపీఎల్‌ మ్యాచ్‌.. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌, రాజస్థాన్‌ రాయల్స్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్‌ జరుగుతోంది.

Ipl 2022 Auction: యశ్‌.. కంగారు పడకు.. ఈసారి నేను క్రీజులోనే ఉన్నాను.. అశ్విన్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికిన బట్లర్‌..
Follow us on

Ipl 2022 Auction: అది 2019 ఐపీఎల్‌ మ్యాచ్‌.. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌, రాజస్థాన్‌ రాయల్స్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్‌ జరుగుతోంది. ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌(Jos Butler) రాజస్థాన్‌ తరపున బ్యాటింగ్‌ చేస్తుండగా… టీమిండియా అగ్రశ్రేణి స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ ( R Ashwin) పంజాబ్‌ తరఫున బౌలింగ్‌ దిగాడు. అయితే యశ్‌ బంతి వేయకముందే నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బట్లర్‌ క్రీజు వదిలి ముందుకు వెళ్లిపోయాడు. దీంతో వెంటనే మన్కడింగ్‌ (Mankading) చేశాడు టీమిండియా స్పిన్నర్‌. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అశ్విన్ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు వాదించగా.. మరికొందరు మాత్రం క్రికెట్‌ నిబంధనలకు అనుగుణంగానే యశ్‌ చేశాడని మద్దతుగా నిలిచారు. సీన్‌ కట్‌ చేస్తే…ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగా వేళం-2022లో అశ్విన్‌ను రూ. 5కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్‌ రాయల్స్ ఫ్రాంఛైజీ. ఈ క్రమంలో మన్కడింగ్‌తో వ్యవహారంతో శత్రువులుగా మారిన యశ్‌, బట్లర్‌ ఇప్పుడు ఒకే డ్రెస్సింగ్‌ రూంను పంచుకోనున్నారు. కాగా అశ్విన్‌ను రాజస్థాన్‌ కొనుగోలు చేయగానే నెటిజన్లు మీమ్స్‌తో రెచ్చిపోయారు.

పింక్‌ కలర్‌ జెర్సీలో చూసేందుకు..

కాగా వేలానికి ముందు జరిగిన ఐపీఎల్‌ రిటెన్షన్‌ ప్రక్రియలో బట్లర్‌ను రాజస్థాన్‌ ఫ్రాంఛైజీ రిటైన్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ టీంలో చేరబోతోన్న అశ్విన్‌కు సాదర స్వాగతం పలికాడీ ఇంగ్లండ్‌ బ్యాటర్‌… ‘అశ్విన్‌.. నేను బట్లర్‌ను. నువ్వేం కంగారు పడకు. ఈసారి నేను క్రీజులోనే ఉన్నాను. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున పింక్‌ కలర్‌ జెర్సీ లో నిన్ను చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. నీతో డ్రెస్సింగ్‌ రూం షేర్‌ చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అంటూ ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ‘టు యాష్‌ విత్‌ లవ్‌’ అంటూ లవ్‌ ఎమోజీతో రాజస్థాన్‌ టీం ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఇది కాస్తా వైరల్‌ గా మారింది. పలువురు క్రికెటర్లు, నెటిజన్లు కూడా ఈ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:Pulwama Attack: ప్రేమికుల రోజున పాక్‌ ఉగ్రమూకల ఘాతుకం.. పుల్వామా నెత్తుటి మరకకు మూడేళ్లు.. అమరులకు నివాళి అర్పిస్తోన్న యావత్‌ దేశం..

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తోన్న జగన్‌ సర్కారు.. ఉగాది రోజు నుంచే పాలన.. పూర్తి వివరాలివే..

Hyderabad: ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన కానిస్టేబుల్‌.. మంత్రి కేటీఆర్‌ అభినందనలు అందుకున్నఈ రియల్‌ హీరో ఏం చేశాడంటే..