జోఫ్రా ఆర్చర్.. వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ముందుగా ప్రకటించిన వారి జాబితాలో ఈ పేరు లేదు. ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లే గాయపడితే ఆర్చర్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. వెస్టిండీస్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడి, ఆపై ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించడం విశేషం. ప్రధానంగా ఇంగ్లిష్ కౌంటీల్లో సత్తాచాటడంతో ఆర్చర్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే వరకూ ఈ క్రికెటర్ పేరు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. అయితే ఐపీఎల్‌లో రాణించినా, ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టులో చోటు దక్కించుకోవడం ఆషా మాషీ కాదు.
అందులోనూ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించడమంటే మాటలు కాదు. ఏది ఏమైనా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నా ఆ జట్టు అంచనాల్ని నిజం చేశాడు. ఇంగ్లండ్ జట్టులో ప్రధాన పేసర్ పాత్ర పోషిస్తూ వరల్డ్‌కప్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2019 సీజన్‌లో 20 వికెట్లతో సత్తాచాటాడు. అదే సమయంలో మార్క్ వుడ్(18) రెండో స్థానంలో నిలిచాడు. ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన వారి జాబితాలో ఆర్చర్, మార్క్ వుడ్‌ల తర్వాత స్థానాల్లో క్రిస్ వోక్స్(16 వికెట్లు, 2019 వరల్డ్‌కప్), ఇయాన్ బోథమ్(16 వికెట్లు, 1992 వరల్డ్‌కప్), ఆండ్రూ ఫ్లింటాఫ్(14 వికెట్లు, 2007 వరల్డ్‌కప్)లు ఉన్నారు.