
వెస్టిండీస్ నిర్దేశించిన 309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జో రూట్ అజేయంగా సెంచరీ సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. తన 54వ అంతర్జాతీయ సెంచరీ, 18వ వన్డే సెంచరీని నమోదు చేసుకున్న రూట్, ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
ఈ మైలురాయిని చేరుకోవడంతో, ఇంగ్లండ్ తరఫున వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఇయాన్ మోర్గాన్ పేరిట ఉన్న రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. ఈ ఘనతతో రూట్ ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు. టెస్ట్ క్రికెట్‌లోనూ 13,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడిగా రూట్ ఇప్పటికే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
జో రూట్ స్థిరమైన ప్రదర్శన, నిలకడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. అతని అద్భుతమైన ఫామ్ ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో మరెన్నో రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ తాజా ఘనతతో ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు రూట్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..