ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను ఉచితంగా అందిస్తున్న జియో సినిమా (Jio cinema).. మరో అడుగు ముందుకు వేసింది. నెట్ ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాగా జియో స్టూడియోస్ పేరుతో భారీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మార్చేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు 100కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. దీంతోపాటే యూజర్లకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా అందించనుంది. ఈ కంటెంట్ చూసేందుకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను కూడా సిద్ధంచేయనుందంట. అయితే ఇందులో క్రికెట్ అభిమానులకు మాత్రం గుడ్ న్యూస్ అందించింది. ఐపీఎల్ మ్యాచ్‌లను మాత్రం ఫ్రీగానే చూడొచ్చని పేర్కింది.
Jio Studios బుధవారం ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అమీర్ ఖాన్ నుంచి హృతిక్ రోషన్, యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్, కృతి సనన్ సహా పలువురు తారలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ 10 కాదు, 20 కాదు, ఏకంగా 100కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. ఇందులో టాప్ ఫిల్మ్‌మేకర్‌ల నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్లు, కొత్త ప్రతిభావంతులైన నటులు నటించనున్నారు. OTT ప్లాట్‌ఫారమ్‌లో అరంగేట్రం చేయబోతున్న నటీనటులతో కలిసి పని చేస్తారు.
ఐపీఎల్ 2023 సీజన్ మే 28తో పూర్తవుతుంది. ఈ లోపే కొత్త కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ప్రీమియం కంటెట్‌ను అందుబాటు ధరల్లోనే ఉంచనున్నట్లు రిలయన్స్ మీడియా, కంటెంట్ బిజినెస్ హెడ్ జ్యోతి దేశ్ పాండే తెలిపారు. క్రికెట్ అభిమానులు మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగానే చూడొచ్చని ప్రకటించారు.
ఐపీఎల్ డిజిటల్ ప్రసారాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఐపీఎల్ 2023 సీజన్ మొదలైన తొలి వారంలోనే జియో సినిమా యాప్ 5.5 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఏప్రిల్ 12న చెన్నై వర్సెస్ రాజస్థాన్ టీంల మధ్య జరిగిన మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 22 మిలియన్ల మంది చూశారని పేర్కొంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..