Team India: టీమిండియా కొత్త కోచ్, కెప్టెన్‌గా వారే.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండే: జైషా కీలక వ్యాఖ్యలు

|

Jul 01, 2024 | 1:25 PM

Jay Shah Reveals Team India New Coach: టీ20 ప్రపంచకప్ 2024 ముగియడంతో, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. దీంతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అందుకే, ఆయన నిష్క్రమణ తర్వాత టీ20లో భారత జట్టు కొత్త కోచ్, కొత్త కెప్టెన్ ఎవరు, వారిద్దరినీ ఎప్పుడు ప్రకటిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొత్త కోచ్‌, కెప్టెన్‌పై బీసీసీఐ అధ్యక్షుడు జై షా కీలక ప్రకటన చేశారు.

Team India: టీమిండియా కొత్త కోచ్, కెప్టెన్‌గా వారే.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండే: జైషా కీలక వ్యాఖ్యలు
Jay Shah Reveals Team India New Coach
Follow us on

Jay Shah Reveals Team India New Coach: టీ20 ప్రపంచకప్ 2024 ముగియడంతో, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. దీంతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అందుకే, ఆయన నిష్క్రమణ తర్వాత టీ20లో భారత జట్టు కొత్త కోచ్, కొత్త కెప్టెన్ ఎవరు, వారిద్దరినీ ఎప్పుడు ప్రకటిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తుఫాన్ కారణంగా టీమిండియాతో పాటు అతడు కూడా బార్బడోస్‌లో చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీసీఐ కొత్త కోచ్‌ని ఎంపిక చేసిందని, దాని ప్రకటనలో జాప్యం జరుగుతోందని తెలిపాడు.

జట్టుకు కొత్త కోచ్, కెప్టెన్ ఎవరు?

టీమ్ ఇండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇటీవల ఇంటర్వ్యూ నిర్వహించిందని, ఇద్దరు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశామని జే షా వెల్లడించారు. అయితే, ఆ పేరును వెల్లడించలేదు. కాగా, శ్రీలంక పర్యటనలో జట్టుకు కొత్త కోచ్‌ని ఖచ్చితంగా తీసుకుంటామని తెలిపాు. జింబాబ్వే టూర్‌లో వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత జట్టు కొత్త కోచ్‌కి గౌతమ్ గంభీర్ అతిపెద్ద పోటీదారుడిగా ఉన్నాడు. అతని పేరు గురించి చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పుడు అతను జట్టుకు కోచ్ అవుతాడా లేదా అనేది శ్రీలంక పర్యటనలో మాత్రమే వెల్లడి కానుంది.

టీ20 ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన నిష్క్రమణ తర్వాత టీమిండియా కెప్టెన్‌ పదవి కూడా ఖాళీ అయింది. దీనికి సంబంధించి జై షా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎవరి పేరును తీసుకోలేదు. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌పై సెలక్టర్లు ఇప్పుడు సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు.

టీమ్ ఇండియాకు 125 కోట్ల రూపాయల పారితోషికం..

టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని గెలుచుకున్న బీసీసీఐ, విజయం సాధించిన ఒకరోజు తర్వాత టీమ్‌ఇండియాకు, సహాయక సిబ్బందికి 125 కోట్ల రూపాయల రివార్డును ప్రకటించింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలపై ప్రశంసలు కురిపించాడు. దీంతో పాటు భవిష్యత్తులో ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లను కూడా గెలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..