Team India: ఆసియాకప్‌తో తిరిగొచ్చిన టీమిండియా స్టార్ ప్లేయర్.. ఏకంగా ఏడాది తర్వాత జట్టులోకి..

Jasprit Bumrah: సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న పేస్ ఏస్ జస్ప్రీత్ బుమ్రా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రానున్నారు. బుమ్రా చివరిసారిగా గత ఏడాది జూన్‌లో T20I ఆడాడు. ఆ సమయంలో భారత్ దక్షిణాఫ్రికాను ఫైనల్‌లో ఓడించి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

Team India: ఆసియాకప్‌తో తిరిగొచ్చిన టీమిండియా స్టార్ ప్లేయర్.. ఏకంగా ఏడాది తర్వాత జట్టులోకి..
Jasprit Bumrah

Updated on: Aug 19, 2025 | 3:15 PM

సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న పేస్ ఏస్ జస్ప్రీత్ బుమ్రా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రానున్నారు. బుమ్రా చివరిసారిగా గత ఏడాది జూన్‌లో T20I ఆడాడు. ఆ సమయంలో భారత్ దక్షిణాఫ్రికాను ఫైనల్‌లో ఓడించి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్ పోరులో బుమ్రా తన నాలుగు ఓవర్లలో 2/18 వికెట్లతో సత్తా చాటాడు. ఓటమి దశనుంచి భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్‌లో 15 వికెట్లు పడగొట్టినందుకు బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.

భారత జట్టు మేనేజ్‌మెంట్ తన పనిభారాన్ని నిర్వహించే క్రమంలో బుమ్రా ఇటీవల వైట్-బాల్ క్రికెట్‌లో పరిమితంగా కనిపిస్తున్నాడు. చివరిసారిగా నవంబర్ 2023లో వన్డే మ్యాచ్ ఆడాడు. జనవరిలో సిడ్నీలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్‌లో నడుము నొప్పితో బాధపడుతూ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌లలో రెండింటికి కూడా అతను దూరమయ్యాడు.

“నాకు ఎటువంటి లిఖిత ప్రణాళిక లేదని నేను అనుకుంటున్నాను. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత మంచి విరామం లభించింది. ఫిజియోలు, జట్టు నిర్వహణ సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా మేం అతన్ని అన్ని కీలక మ్యాచ్‌లకు అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం. ప్రపంచ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి పెద్ద సిరీస్‌లు ఉన్నాయి. అతన్ని అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం. గత 2-3 సంవత్సరాలుగా అతను గాయాలు ఎదుర్కొంటున్నాడు”అని పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ బుమ్రా గురించి తెలిపాడు.

భారత జట్టు: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (కీపర్), హర్షిత్ రాణా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..