Jasprit Bumrah: అక్కడున్నది బుమ్రా మరీ.. ఎవరొచ్చినా జుజుబీ.! ఆ పాక్ బౌలర్ పిల్లబచ్చానే..

జస్ప్రిత్ బుమ్రా.. టీమిండియా పేస్ బౌలింగ్‌ను ముందుంది నడిపిస్తున్న లీడర్. ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ 19 వికెట్లతో సత్తా చాటిన బుమ్రా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. అటు ఈ సిరీస్‌లో..

Jasprit Bumrah: అక్కడున్నది బుమ్రా మరీ.. ఎవరొచ్చినా జుజుబీ.! ఆ పాక్ బౌలర్ పిల్లబచ్చానే..
Jasprit Bumrah

Updated on: Mar 18, 2024 | 12:15 PM

జస్ప్రిత్ బుమ్రా.. టీమిండియా పేస్ బౌలింగ్‌ను ముందుంది నడిపిస్తున్న లీడర్. ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ 19 వికెట్లతో సత్తా చాటిన బుమ్రా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. అటు ఈ సిరీస్‌లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అద్భుతంగా రాణించడంతో.. లేటెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బుమ్రాను వెనక్కినెట్టి టాప్ ర్యాంక్ సాధించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా బుమ్రాతో ఓ పాకిస్తాన్ బౌలర్‌ను పోల్చడం.. ఆ జట్టు మాజీ బౌలర్‌కు అస్సలు నచ్చలేదు. అతడు కొంచెం ఘాటుగానే స్పందించాడు. ఆడో పిల్లబచ్చా అంటూ సంబోధించాడు.

ఓ క్రికెట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ‘షాహీన్ అఫ్రిదిని టీమిండియా పేసర్ బుమ్రాతో పోల్చడం సరికాదని అన్నాడు. అఫ్రిదీ గాయపడిన ప్రతీసారి.. తిరిగి బరిలోకి దిగినప్పుడు బౌలింగ్ లయను కోల్పోవడమే కాకుండా.. పేస్ కూడా తగ్గుతుంది. కానీ బుమ్రా అలా కాదు.. గాయం అయినా.. ఆ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన మొదటి మ్యాచ్ నుంచి అద్భుతమైన వేగంతో, స్వింగ్‌తో బౌలింగ్ చేస్తాడు. గొప్పగా రాణించగలడు. కొంతమంది మాత్రమే ఈ ఫీట్ సాధించగలరు. అందులోనూ బుమ్రా రేర్ పీస్. అఫ్రిదీ, బుమ్రాలలో ఒకరిని ఎంచుకోమంటే.. నా ఓటు బుమ్రాకే పడుతుంది’ అని పేసర్ ఇర్ఫాన్ పేర్కొన్నాడు .

కాగా, 2023 ప్రపంచకప్‌లో బుమ్రా రీ-ఎంట్రీ ఇచ్చి.. 11 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. అటు పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ మాత్రం పేలవ ఫామ్ కొనసాగించాడు. అటు కివీస్ పర్యటనలోనూ అఫ్రిది ఇదే ఫామ్ కొనసాగించగా.. పాక్ జట్టు దారుణ పరాజయాన్ని ఎదుర్కుంది. అటు మహ్మద్ ఇర్ఫాన్ 2012లో పాక్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. తన కెరీర్‌లో వన్డే, టీ20, టెస్ట్ కలిపి 109 వికెట్లు పడగొట్టాడు.