Jasprit Bumrah : నేను ఆడతారా.. నేను ఆడతా.. బుమ్రా ఆసియా కప్ గురించి ఏం చెప్పాడంటే ?

ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. భారత జట్టు ఎంపికపై ఆగస్టు 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందే, జస్ప్రీత్ బుమ్రా తాను టోర్నీలో ఆడేందుకు అందుబాటులో ఉన్నానని బీసీసీఐకి సమాచారం అందించారు.

Jasprit Bumrah : నేను ఆడతారా.. నేను ఆడతా.. బుమ్రా ఆసియా కప్ గురించి ఏం చెప్పాడంటే ?
Jasprit Bumrah

Updated on: Aug 17, 2025 | 9:57 AM

Jasprit Bumrah : క్రికెట్ అభిమానుల ఆశలకు ఊపిరి పోస్తూ.. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నానని ఆసియా కప్ 2025 ఆడటానికి సిద్ధంగా ఉన్నానని బీసీసీఐకి తెలియజేశారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా మూడు టెస్టులు మాత్రమే ఆడిన బుమ్రా, ఆసియా కప్‌లో పాల్గొంటారా లేదా అనే సందిగ్ధతకు తెరపడింది. త్వరలోనే ఏషియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించనున్న నేపథ్యంలో బుమ్రా ఈ నిర్ణయం క్రికెట్ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చింది.

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు త్వరలో ప్రకటన వెలువడనుంది. ఆగస్టు 19న బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే, కొంతకాలంగా భారత క్రికెట్ అభిమానులను ఒక ప్రశ్న వేధిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌లో ఆడతాడా లేదా? ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా మూడు టెస్టులు మాత్రమే ఆడిన బుమ్రా, తన లభ్యత గురించి బీసీసీఐకి స్పష్టంగా చెప్పాడు. ఈ విషయం భారత జట్టుకు, అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ఆసియా కప్ ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు ముందు జట్టు ఎంపికపై కసరత్తు జరుగుతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు ఆగస్టు 19న సమావేశం కానున్నారని సమాచారం. ఈ సమావేశానికి ముందే జస్ప్రీత్ బుమ్రా బీసీసీఐకి తాను ఆసియా కప్‌కు అందుబాటులో ఉన్నానని తెలియజేశాడు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు అందిన సమాచారం ప్రకారం.. జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ ఎంపికకు అందుబాటులో ఉన్నానని బీసీసీఐకి సమాచారం అందించారు. దీనిపై తదుపరి వారంలో జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుందని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఇది భారత జట్టు అభిమానులకు ఒక శుభవార్త అని చెప్పవచ్చు. మరో శుభవార్త ఏమిటంటే, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయ్యాడు. ఇటీవల సర్జరీ చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. ఇది ఆసియా కప్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలం చేకూరుస్తుంది. అలాగే, ఇంగ్లాండ్ సిరీస్‌లో బాగా ఆడిన శుభ్‌మన్ గిల్ కూడా జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

ఆసియా కప్‌లో భారత్ గ్రూప్ ఏలో ఉంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19న ఒమన్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సూపర్-4 రౌండ్ కూడా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా తన 31 సంవత్సరాల కెరీర్‌లో ఇప్పటివరకు భారత్ తరపున 70 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు 6.27. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 2024 టీ20 ప్రపంచ కప్‌లో అఫ్ఘానిస్థాన్‌పై నమోదైంది. ఆ మ్యాచ్‌లో బుమ్రా కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ ప్రదర్శనతో భారత్ టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..