తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డ్..! జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో
Harmanpreet Kaur statue at Jaipur Wax Museum: హర్మన్‌ప్రీత్ కౌర్ జాతీయ జెర్సీలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. భారత మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు, హర్మన్‌ప్రీత్ కౌర్ సాధించిన విజయాలకు ఈ గుర్తింపు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.

Harmanpreet Kaur statue at Jaipur Wax Museum: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్, డాషింగ్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం (Jaipur Wax Museum) లో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు.
తొలి మహిళా క్రికెటర్‌గా..
జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఇప్పటికే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ పురుష క్రికెటర్ల విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరుతున్న మొదటి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించనుంది.
నహర్‌ఘర్ కోటలో..
ఈ మ్యూజియం జైపూర్‌లోని చారిత్రాత్మక నహర్‌ఘర్ కోటలో (Nahargarh Fort) ఉంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ మ్యూజియంలో ఇప్పుడు హర్మన్ విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
మ్యూజియం వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ ఈ విషయంపై స్పందిస్తూ.. “హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళా క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె దూకుడు, నాయకత్వ లక్షణాలు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. అందుకే ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం,” అని తెలిపారు.
విగ్రహం ఎలా ఉండబోతోంది?
హర్మన్‌ప్రీత్ కౌర్ జాతీయ జెర్సీలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. భారత మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు, హర్మన్‌ప్రీత్ కౌర్ సాధించిన విజయాలకు ఈ గుర్తింపు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








