ఈ ఏజ్‌లోనూ అదేం కొట్టుడు బాసూ! 10 సిక్సర్లతో యూనివర్స్ బాస్ ఊహకందని ఊచకోత.. ఓ లుక్కేయండి..

యూనివర్స్ బాస్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకు పెద్దగా పరిచయమక్కర్లేదు. ఫార్మాట్ ఏదైనా అతడు బరిలోకి దిగితే బౌలర్ల ఊచకోత ఖాయమే. ఇంతకీ ఈ యూనివర్స్ బాస్.. ఎవరో మీకు తెలుసు కదా.. మన క్రిస్ గేల్. 40 ఏళ్ళ వయస్సు వచ్చినా కూడా.. గేల్‌లో పవర్ ఇంకా తగ్గలేదు. బరిలోకి దిగితే సిక్సర్లు బాదాల్సిందే.

ఈ ఏజ్‌లోనూ అదేం కొట్టుడు బాసూ! 10 సిక్సర్లతో యూనివర్స్ బాస్ ఊహకందని ఊచకోత.. ఓ లుక్కేయండి..
Universe Boss
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 27, 2024 | 11:33 AM

యూనివర్స్ బాస్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకు పెద్దగా పరిచయమక్కర్లేదు. ఫార్మాట్ ఏదైనా అతడు బరిలోకి దిగితే బౌలర్ల ఊచకోత ఖాయమే. ఇంతకీ ఈ యూనివర్స్ బాస్.. ఎవరో మీకు తెలుసు కదా.. మన క్రిస్ గేల్. 40 ఏళ్ళ వయస్సు వచ్చినా కూడా.. గేల్‌లో పవర్ ఇంకా తగ్గలేదు. బరిలోకి దిగితే సిక్సర్లు బాదాల్సిందే. తనదైన శైలి తుఫాన్ బ్యాటింగ్‌తో అత్యుత్తమ బౌలర్లను సైతం ఉఫ్ అని ఊదేస్తాడు. ఈ వెటరన్ బ్యాటర్ ప్రస్తుతం జరుగుతోన్న ఓ ఫ్రాంచైజీ లీగ్‌లో రెచ్చిపోయాడు. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం.

ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతోంది. ఈ లీగ్‌లో రిటైర్డ్‌ ఆటగాళ్లందరూ ఆడుతున్నారు. తెలంగాణ టైగర్స్ తరపున ఆడుతోన్న క్రిస్ గేల్.. లీగ్‌లోని ఆరో మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌పై తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. తృటిలో గేల్ సెంచరీ మిస్సవ్వగా.. అతడి జట్టు మాత్రం నిర్ణీత ఓవర్లలో 270 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. తద్వారా ఉత్తరప్రదేశ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గేల్ 46 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 204.34 స్ట్రైక్ రేట్‌తో గేల్ 10 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. కొసమెరుపు ఏంటంటే.. గేల్ తప్ప మిగిలిన ఏ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కండీ రెడ్డి 39 పరుగులు, కె కమలేష్ 46 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ బౌలర్ క్రిస్ మొఫు 5 వికెట్లు పడగొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరప్రదేశ్ జట్టును పవన్ నేగి ఆదుకున్నాడు. నేగి కేవలం 56 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 139 పరుగులు చేశాడు. దాదాపుగా 248.21 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు నేగి. అతడితో పాటు అన్షుల్ కపూర్ 71 పరుగులు సాధించడంతో ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 269 పరుగులు సాధించింది.

ఇది చదవండి: 6 ఇన్నింగ్స్‌ల్లో 63 పరుగులు.. కట్ చేస్తే.. నెక్స్ట్ మ్యాచ్‌లో విరాట్ ఫ్రెండ్‌కు టీమిండియా గుడ్‌బై.. ఎవరంటే?

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!