సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కాలంలాగే, బీసీసీఐ (BCCI) అధ్యక్షుడిగా పదవీకాలం కూడా కష్టనష్టాలతో ఉంది. గంగూలీ ఆధ్వర్యంలో భారతదేశం తన మొట్టమొదటి డే/నైట్ టెస్టును ఆడింది. అయితే మహిళల జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో పింక్-బాల్ గేమ్‌తో సహా లైట్ల వెలుగులో టెస్టులు ఆడింది. అంతేకాకుండా BCCI ఎదుర్కొన్న అతిపెద్ద అడ్డంకులలో ఒకటి కరోనా కాలంలో ఐపిఎల్‌ను నిర్వహించడం. దీనిని గంగూలీ ఒకసారి కాదు రెండుసార్లు పరిష్కరించాడు. UAEలో ప్రపంచంలోనే అతిపెద్ద T20 లీగ్‌ను నిర్వహించడం. BCCI చీఫ్‌గా గంగూలీ మూడేళ్ల పదవీకాలం ఈ ఏడాది చివర్లో సెప్టెంబర్-అక్టోబర్‌లో ముగుస్తుంది.
“ఇది మరింత సవాలుగా ఉందని నేను అనుకోను. నా వారసత్వం ఏమిటో? నేను ఇప్పుడు చెప్పలేను. ఏమి జరుగుతుందో చూద్దాం. నా వారసత్వాన్ని నిర్ధారించడం మీ అందరి ఇష్టం. కానీ గత రెండేళ్లుగా కోవిడ్-19 కారణంగా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాము. మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. మేము ఇంకా ఎక్కువ క్రికెట్‌ను ఆడించడం మా అదృష్టం ”అని గంగూలీ స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ హయాంలో తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బ, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదించడం.
భారత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ వన్డేల్లో కూడా కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలకడంతో మొత్తం విషయం మొదలైంది. భారత్ T20I కెప్టెన్‌గా వైదొలగాలని విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని బోర్డు ఎలా స్వీకరించిందనే దానిపై కోహ్లీ, గంగూలీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. కోహ్లీని కొనసాగాలని బీసీసీఐ కోరినట్లు గంగూలీ చెప్పగా, మాజీ కెప్టెన్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడాడు.
దక్షిణాఫ్రికాతో 1-2 టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ భారత టెస్ట్ కెప్టెన్‌గా వైదొలిగాడు. భారత టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం, వన్డే కెప్టెన్‌గా బోర్డు అతడిని తొలగించడంపై చాలా మంది అభిప్రాయపడ్డారు. కోహ్లీకి గంగూలీ షోకాజ్ నోటీసు జారీ చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. BCCI అధ్యక్షుడు అటువంటి వార్తలను పూర్తిగా ఖండించాడు.
Read Also.. IPL 2022 Mega Auction: వేలంలో అత్యధిక ప్రైస్ పొందే అగ్రశ్రేణి ఆటగాళ్లు.. టాప్ టెన్ లిస్టులో ఎవరున్నారంటే?