
Team India: దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్న ఇషాన్ కిషన్‌ను బీసీసీఐ ఊహించని విధంగా సెలవుపై పంపింది. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకపై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వెంటనే అతనికి రెస్ట్ ఇవ్వడంతో, ఈ స్టార్ ఆటగాడు ఇప్పుడు తన సొంతూరైన పాట్నాలో తన క్రికెట్ అకాడమీ బాధ్యతలను చూసుకుంటున్నాడు.
భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు గడిచిన ఒక నెల కాలం ఎంతో అద్భుతంగా సాగింది. తన బ్యాటింగ్ పవర్‌తో టీమ్ ఇండియాలోకి తిరిగి రావడమే కాకుండా, రాబోయే టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను మొదటిసారి ఛాంపియన్‌గా నిలబెట్టిన కిషన్, విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదే జోరును కొనసాగించాడు.
సునామీ ఇన్నింగ్స్.. ఆ వెంటనే రెస్ట్: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లోనే 125 పరుగులు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, ఈ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే బీసీసీఐ (BCCI) సూచనల మేరకు అతనికి విశ్రాంతి ఇచ్చారు. దీనితో తదుపరి రెండు మ్యాచ్‌లకు అతను జార్ఖండ్ జట్టుకు దూరమయ్యాడు.
పాట్నాలో బిజీగా ఇషాన్: బీసీసీఐ నుంచి సెలవు దొరకగానే ఇషాన్ కిషన్ తన సొంతూరైన పాట్నాకు చేరుకున్నాడు. అక్కడ తను ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీలో చిన్నారులకు శిక్షణ ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకాడమీలోని పిల్లలతో కలిసి వార్మప్ చేయడం, వారికి క్రికెట్ మెళకువలు నేర్పించడంతో పాటు, అక్కడి స్పిన్నర్ల బౌలింగ్‌లో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఒక రకంగా తన క్రికెట్ బిజినెస్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.
Ishan Kishan at his Academy, mentoring the students and practicing with them🔥#IshanKishan pic.twitter.com/D3K47ccYVa
— Ayush (@AyushCricket32) December 30, 2025
వన్డే జట్టులోకి కూడా రీ-ఎంట్రీ? ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఉన్న ఫామ్ చూస్తుంటే, అతను త్వరలోనే వన్డే జట్టులోకి కూడా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్ స్థానంలో వన్డే టీమ్‌లోకి ఇషాన్‌ను తీసుకునే దిశగా సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లోనే 517 పరుగులు చేసిన ఘనత ఇషాన్‌కు ఉంది. ఈ పరుగుల వేట చూస్తుంటే టీమ్ ఇండియాలో అతని స్థానం మరింత సుస్థిరం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..