టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. దీనికి కారణం ఇర్ఫాన్ షేర్ చేసిన ఒక్క ఫొటోనే. తాజాగా తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య సఫా బేగ్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు పఠాన్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో మొదటిసారిగా తన భార్య ముఖాన్ని ప్రపంచానికి చూపించాడు. ఇది వరకు కూడా భార్యతో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు పఠాన్. కానీ ఎక్కడా ఆమె ముఖం కనిపించలేదు. సఫా బేగ్ బుర్ఖాలో ఉన్నప్పుడు, ముఖానికి మాస్క్ లేదా చేతులు అడ్డం పెట్టుకున్న ఫొటోలను మాత్రమే నెట్టింట పంచుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే పెళ్లి రోజున మాత్రం తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఇర్ఫాన్. తన భార్య ముఖం స్పష్టంగా కనిపించేలా ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘నా జీవితంలో అపరిమితమైన పాత్రలను పోషించే నా భాగస్వామి. వెన్నంటి ఉండే నా సహచరురాలు, స్నేహితురాలు, నా పిల్లలకు మాతృమూర్తి.. ఇలా బహుముఖ రూపాల్లో తోడ్పాటు అందిస్తున్నావు. మన ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు’ అని తన సతీమణిపై ప్రేమను కురిపించాడు ఇర్ఫాన్ పఠాన్.
ప్రస్తుతం ఇర్ఫాన్ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. చాలామంది ఇర్ఫాన్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఎప్పటిలాగే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తమ కుటిల బుద్ధిని చూపించుకున్నారు. నీ భార్య ఫేస్‌ను ఎందుకు చూపిస్తున్నావంటూ అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. వెంటనే ఫొటోను డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్, సఫా బేగ్ 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారని. సఫా బేగ్ హైదరాబాద్ నివాసి, అలాగే మోడల్ కూడా. వీరిద్దరూ మక్కాలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కామెంటేటర్‌గా మారాడు. అంతకు ముందు భారత దేశపు అత్యుత్తమ ఆల్-రౌండర్లలో ఒకటిగా ఇర్ఫాన్ పఠాన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా స్వింగ్ బౌలింగ్ తో సంచలనాలు సృష్టించాడీ ఫాస్ట్ బౌలర్.
Infinite roles mastered by one soul – mood booster, comedian, troublemaker, and the constant companion, friend, and mother of my children. In this beautiful journey, I cherish you as my wife. Happy 8th my love ❤️ pic.twitter.com/qAUW8ndFAJ
— Irfan Pathan (@IrfanPathan) February 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..