IND vs IRE 1st T20I: డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో ఐర్లాండ్ టీమ్ తొలి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఐరీష్ బ్యాటర్లు 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేశారు. ఐర్లాండ్ తరఫున బారీ మెక్‌కార్తీ(51, నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా, కర్టీస్ కాంపర్ 39 పరుగులతో మెప్పించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసే సమయానికి వర్షం అడ్డుపడింది. దీంతో డర్క్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లుగా అంపైర్లు ప్రకటించారు.
అయితే వర్షం కారణంగా భారత్‌పై ఓడిపోయిన ఐర్లాండ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డ్‌ను రెండు సార్లు నమోదు చేసింది. అదెలా అంటే.. భారత్‌పై బ్యాటింగ్ ఆడుతున్న క్రమంలో ఐర్లాండ్ టీమ్ 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ అపై వచ్చిన బ్యాటర్లే 108 పరుగులు చేశారు. ఇలా టీ20 క్రికెట్‌లో అతి తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, ఆపై 100కు పైగా పరుగులు చేసిన ఒకే ఒక్క జట్టుగా ఐర్లాండ్ అవతరించింది. ఐర్లాండ్ గతంలోనూ ఇలాంటి ఘనతను సాధించింది. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో.. ఐర్లాండ్ 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, ఆ తర్వాత మిగతా బ్యాటర్ల సహాయంతో ఏకంగా 137 పరుగులు చేసింది. ఇది టీ20 క్రికెట్‌లో ఓ ప్రపంచ రికార్డు. ఇదే రికార్డ్‌ను ఐర్లాండ్ భారత్‌పై తాజాగా మరోసారి 100కు పైగా రన్స్ చేసి చూయించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున రింకూ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రం చేశారు. అలాగే దాదాపు 327 రోజుల తర్వాత ఆటలోకి పునరాగమనం చేసిన బూమ్రా కెప్టెన్‌గా 2 వికెట్లు, తొలి టీ20 విజయం అందుకున్నాడు. ఇంకా ఆరంగేట్ర ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. అయితే అరంగేట్ర ఆటగాడు రింకూకి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.
బారీ మెక్‌కార్తీ మెరుపులు..
Now THAT is how you end an innings and bring up your maiden T20I half century.
Well done Barry McCarthy.
SCORE: https://t.co/ryMh1qvUER#IREvIND #BackingGreen ☘️@JoyEbike pic.twitter.com/Q801GabgEa
— Cricket Ireland (@cricketireland) August 18, 2023
భారత్‌దే తొలి టీ20..
India win the first T20I in Malahide!#IREvIND | 📝: https://t.co/H3uqULHWXh pic.twitter.com/4NvDPjN76K
— ICC (@ICC) August 18, 2023
ఆటలోకి యువ ఆటగాళ్లు..
Moments like these! ☺️
All set for their debuts in international cricket and T20I cricket respectively 👍 👍
Congratulations Rinku Singh and Prasidh Krishna as they receive their caps from captain Jasprit Bumrah 👏 👏#TeamIndia | #IREvIND pic.twitter.com/JjZIoo8B8H
— BCCI (@BCCI) August 18, 2023
ఏ మార్పు లేదు..
What a start from the #TeamIndia captain 🤩
Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo
— JioCinema (@JioCinema) August 18, 2023
మిషన్ సక్సెస్..
T20I debut ✅
Maiden T20I wicket ✅
Return to international cricket ✅Prasidh Krishna 🤝 M. O. O. D
Follow the match ▶️ https://t.co/cv6nsnJqdO #TeamIndia | #IREvIND pic.twitter.com/NGfMsmQdRb
— BCCI (@BCCI) August 18, 2023
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్, హ్యారీ టక్టర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ క్యాంపర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, బెంజమిన్ వైట్.
భారత్: రితురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ