IPL 2022 Points Table: టోర్ని నుంచి 2 జట్లు ఔట్‌.. మూడో బెర్త్‌ కోసం 7 జట్ల మధ్య గట్టి పోటీ..!

|

May 13, 2022 | 6:52 AM

IPL 2022 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ లీగ్ దశ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్ పోరు రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఈ రేసు 10 జట్ల

IPL 2022 Points Table: టోర్ని నుంచి 2 జట్లు ఔట్‌.. మూడో బెర్త్‌ కోసం 7 జట్ల మధ్య గట్టి పోటీ..!
Ipl Standings Ranking
Follow us on

IPL 2022 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ లీగ్ దశ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్ పోరు రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఈ రేసు 10 జట్ల మధ్య లేదు. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో ఈ రేసు ఇప్పుడు ఏడు జట్ల మధ్య మాత్రమే ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకున్న తొలి జట్టుగా గుజరాత్‌ అవతరించగా రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు ఇప్పటికే నిష్క్రమించింది. గురువారం ఈ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పనిని కూడా ముగించింది. గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి చెన్నైని ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించేలా చేసింది. ముంబైతో మ్యాచ్‌కు ముందు చెన్నై లెక్కల ప్రకారం ప్లేఆఫ్ రేసులో ఉంది. రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాలి. కానీ ముంబై ఐదు వికెట్ల తేడాతో చెన్నైని ఓడించి పెద్ద దెబ్బ కొట్టింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేఆఫ్‌కు చేరకపోవడం ఇది రెండోసారి. అంతకు ముందు ఈ జట్టు 2020లో ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.

ముంబై విజయంతో ప్లేఆఫ్‌కు చేరుకోవాలన్న చెన్నై ఆశలకు గండిపడినట్లయింది. ముంబై 10వ స్థానంలో, చెన్నై 9వ స్థానంలో ఉన్నాయి. 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై మూడు విజయాలు, 9 ఓటములతో ఆరు పాయింట్లు సాధించింది. అదే సమయంలో చెన్నై 12 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు ఎనిమిది ఓటములతో ఎనిమిది పాయింట్లను కలిగి ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలుపు, మూడు ఓటములతో నంబర్‌వన్‌లో ఉంది. రెండో నంబర్ లక్నో సూపర్ జెయింట్స్ 16 పాయింట్లు, రాజస్థాన్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో ఐదో స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో ఆరో స్థానంలో, కోల్ కతా నైట్ రైడర్స్ 10 పాయింట్లతో ఏడో స్థానంలో, పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాయి.

పంజాబ్‌-ఆర్‌సీబీ మ్యాచ్‌ కీలకం

ప్లేఆఫ్ రేసు దృష్ట్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ కీలకం. ఈ రెండు జట్లూ ఇప్పటికీ ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. రెండు జట్లూ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి విజయం సాధించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Karate Kalyani youtuber: కరాటే కల్యాణి, యూట్యూబర్‌ మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడి..

K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..

CSK vs MI: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు..