IPL Team Sale : హర్ష గోయెంకా సంచలన ట్వీట్.. అమ్మకానికి మరో ఐపీఎల్ జట్టు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇది ఒక సంచలన వార్తగా మారింది. 2025లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కొనుగోళ్ల గురించి మరో పెద్ద ట్విస్ట్ బయటపడింది.

IPL Team Sale : హర్ష గోయెంకా సంచలన ట్వీట్.. అమ్మకానికి మరో ఐపీఎల్ జట్టు
Rajasthan Royals Ipl 2026

Updated on: Nov 28, 2025 | 1:31 PM

IPL Team Sale : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇది ఒక సంచలన వార్తగా మారింది. 2025లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో పెద్ద ట్విస్ట్ బయటపడింది. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు హర్ష గోయెంకా చేసిన ట్వీట్ ప్రకారం.. కేవలం RCB మాత్రమే కాదు, 2008 ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన రాజస్థాన్ రాయల్స్ కూడా కొత్త యజమానుల కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ఈ అమ్మకాల వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అన్న అయిన ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా, నవంబర్ 27వ తేదీన తన ఎక్స్ అకౌంట్లో ఒక సంచలన పోస్ట్ చేశారు. “నేను విన్న దాని ప్రకారం, ఒకటి కాదు, రెండు ఐపీఎల్ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి.. అవి RCB, RR. ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న భారీ విలువను సొమ్ము చేసుకోవడానికి యజమానులు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి రెండు జట్లు అమ్మకానికి 4 నుంచి 5 మంది కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారు. మరి విజయం సాధించే కొనుగోలుదారులు పూణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా USA నుంచి వస్తారా?” అని ఆయన ట్వీట్ చేశారు.

ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్న డియాజియో కంపెనీ నవంబర్ 5న అధికారికంగా ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు ధృవీకరించింది. అంతకుముందు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా చేసిన పోస్ట్ ద్వారానే ఈ విషయం లీకైంది. ఆర్సీబీ యజమానులు తమ జట్టుకు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్లు) భారీ ధరను ఆశిస్తున్నట్లు సమాచారం. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 2022లో ఆర్సీబీ విలువ కేవలం 1 బిలియన్ డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అయితే ఈ సీజన్‌లో వారు ఛాంపియన్‌షిప్ గెలవడంతో, ఇప్పుడు దాని విలువ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

డియాజియో ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఈ అమ్మకం ప్రక్రియ మార్చి 31, 2026 నాటికి ముగిసే అవకాశం ఉంది. ఆదార్ పూనావాలా, మోహన్‌దాస్ పాయ్, వినోద్ ఖమత్‌తో కూడిన కన్సార్టియం (కొనుగోలు బృందం) ఆర్సీబీ కోసం బిడ్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి

2008 ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ నిర్వహిస్తోంది. ఇందులో వారికి 65% వాటా ఉంది. మైనారిటీ వాటాదారులుగా లాచ్‌లాన్ ముర్డోచ్, రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్ వంటి ప్రముఖులు ఉన్నారు. హర్ష గోయెంకా ట్వీట్ ప్రకారం.. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ కూడా కొత్త యజమానుల కోసం చూస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..