IPL 2022 Mega Auction: ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం..! ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీలు..

|

Dec 22, 2021 | 9:28 PM

ఐపీఎల్-2022 మెగా వేలాన్ని ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు...

IPL 2022 Mega Auction: ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం..! ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీలు..
Ipl 2022
Follow us on

ఐపీఎల్-2022 మెగా వేలాన్ని ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ” కోవిడ్-19 మరింత పెరిగితే తప్ప, మెగా వేలం నిలివేయమని చెప్పారు. రెండు రోజుల ఈవెంట్ ఫిబ్రవరి 7, 8 తేదీలలో జరుగుతుంది. గతంలో నిర్వహించినట్లుగానే బెంగళూరులో మెగా వేలం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సన్నాహాలు జరుగుతున్నాయని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. యూఏఈలో వేలం నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ప్రస్తుతానికి బీసీసీఐకి అలాంటి ఆలోచనేమీ లేదని తెలుస్తోంది.

ఈ సంవత్సరం IPLలో సంజీవ్ గోయెంకా యాజమాన్యంలోని లక్నో ఫ్రాంచైజీతోపాటు వెంచర్ క్యాపిటల్ సంస్థ CVC యాజమాన్యంలోని అహ్మదాబాద్ క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేస్తోంది. అయితే CVC BCCI నుంచి తన లెటర్ ఆఫ్ ఇంటెంట్ కోసం వేచి ఉంది. అయితే అది అందుతుందని భావిస్తున్నారు. రెండు జట్లూ ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవడానికి క్రిస్మస్ వరకు సమయం ఉంది. అయితే CVC ఇంకా క్లియరెన్స్ పొందనందున BCCI రెండింటికీ తేదీలను పొడిగించవచ్చు.

జట్టును నిర్మించడానికి చాలా ప్రయత్నించిన తర్వాత ఆటగాళ్లను విడుదల చేయడం కష్టంగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్త్ జిందాల్ చెప్పారు. ” శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, కగిసో రబాడ, అశ్విన్‌లను కోల్పోవడం చాలా బాధాకరం.” అని నవంబర్ 30న ఆటగాళ్ల రిటెన్షన్ ప్రకటించిన తర్వాత జిందాల్ చెప్పాడు.

Read Also.. IND vs SA: కరోనా వచ్చినా సిరీస్ రద్దు కాదు.. BCCI, CSA ఒప్పందం ఏం చెబుతోంది..