IPL 2021, KKR vs SRH Match Result: అత్యల్ప స్కోరింగ్ మ్యాచులో కోల్‌కతా టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత లక్ష్యాన్ని చివరి ఓవర్ వరకు పోరాటం చేసి 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో కోల్‌కతా టీం ప్లేఆఫ్ ఆశలను మరింత పదిల పరుచుకుంది. సన్‌రైజర్స్ విధించిన 116 పరుగుల అత్యల్ప స్కోర్‌ను ఛేందించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, శుభ్మన్ గిల్ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. వీరి ఆట తీరుకు భిన్నంగా ఆడారు. అయితే, ఇన్నింగ్స్ 4.4 ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెంకటేష్ అయ్యర్ (8) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన త్రిపాఠి (7) కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక పోయాడు. రషీద్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. శుభ్మన్ గిల్ (57 పరుగులు, 51 బంతులు, 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్ ఆడి మ్యాచును కోల్‌కతాకు అనుగుణంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఐపీఎల్ 2021 తో తన తొలి అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. 16.3 ఓవర్లో కౌల్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. అప్పటికే మ్యాచ్ కోల్‌కతా వైపు తిరిగింది. అనంతరం రాణా (25 పరుగులు, 33 బంతులు, 3 ఫోర్లు) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. హోల్డర్ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మిగతా పనిని దినేష్ కార్తిక్(18 పరుగులు, 12 బంతులు, 3 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2) కానిచ్చేశారు. ఈ క్రమంలో దినేష్ కార్తిక్ ఐపీఎల్‌లో 4000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 2 వికెట్లు, సిద్ధార్ధ్ కౌల్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ టీం తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 116 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. మరోవైపు కేకేఆర్ టీంకు మాత్రం చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో కోల్‌కతా టీం అద్భుతంగా ఆడింది. బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ టీం ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ 26 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత అబ్దుల్ సమద్ 25, ప్రియం గార్గ్ 21, జాన్సన్ రాయ్ 10 పరుగులతో నిలిచారు. వీరు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లు అంతా కేవలం సింగిల్ డిజిట్ వద్దే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు. సాహా 0, అభిషేక్ శర్మ 6, జాన్సన్ హోల్డర్ 2, రషీద్ ఖాన్ 8 పరుగులు సాధించాడు. భువనేశ్వర్ 6, సిద్ధార్ద్ కౌల్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో టిం సౌతి, శివం మావి, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు.
Played Lad ??
A calculative half century from KKR ? opener @ShubmanGill ??? #VIVOIPL #KKRvSRH
Follow the match ? https://t.co/Z5rRXTNps5 pic.twitter.com/Ipko4nS4VH
— IndianPremierLeague (@IPL) October 3, 2021
IPL 2021, RCB vs PBKS Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు