ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి రెండు కొత్త ఫ్రాంచైజీల రాకతో మొత్తం 10 జట్లు, వాటి మధ్య 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ని 5వ సారి టైటిల్ అందించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ రంగంలోకి దిగనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి టైటిల్‌ను కాపాడుకోవాలనుకుంటోంది. ధోనీ(MS Dhoni) తన చివరి ఐపీఎల్ ఆడనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే మరోసారి ట్రోఫీ గెలవాలని సీఎస్‌కే టీం కోరుకుంటోంది. ఇక ఇదంతా పక్కన పెడితే, ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్ ఎవరు అనే ప్రశ్నక సమాధానం ఎవరో మీకు తెలుసా? ఇంకెవరు సీఎస్‌కే సారథి ధోని కంటే మెరుగైన ఫినిషర్ లేరనడానికి ఈ గణాంకాలు చూస్తే ఇట్టే చెప్పేయోచ్చు. చివరి 5 ఓవర్లలో పరుగులు సాధించడంలో ధోనిని మించిన వారు ఉండరు. ఆ గణాంకాలేంటో ఇప్పుడు చూద్దాం.
15వ ఓవర్ నుంచి ధోనీ బాదుడు షురూ..
వాస్తవానికి, రికార్డులను పరిశీలిస్తే, ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ధోనీ నంబర్-1 స్థానంలో ఉన్నాడు. 15వ ఓవర్‌లో కూడా ధోనీ అత్యధికంగా 442 పరుగులు చేశాడు. 16వ ఓవర్‌లో పరుగుల వేగం మరింత పెరిగింది. ఈ ఓవర్‌లో ధోనీ 476 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో చివరి 5 ఓవర్లలో ఏ బ్యాట్స్‌మెన్ అత్యధిక పరుగులు సాధించాడో ఇప్పుడు చూద్దాం.
16వ ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..
మహేంద్ర సింగ్ ధోని – 476 పరుగులు
ఏబీ డివిలియర్స్ – 447 పరుగులు
రోహిత్ శర్మ – 336 పరుగులు
కీరన్ పొలార్డ్ – 314 పరుగులు
యువరాజ్ సింగ్ – 305 పరుగులు
17వ ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..
మహేంద్ర సింగ్ ధోని – 572 పరుగులు
కీరన్ పొలార్డ్ – 445 పరుగులు
ఏబీ డివిలియర్స్ – 386 పరుగులు
రోహిత్ శర్మ – 362 పరుగులు
దినేష్ కార్తీక్ – 360 పరుగులు
18వ ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..
మహేంద్ర సింగ్ ధోని – 596 పరుగులు
కీరన్ పొలార్డ్ – 433 పరుగులు
ఏబీ డివిలియర్స్ – 406 పరుగులు
రోహిత్ శర్మ – 293 పరుగులు
విరాట్ కోహ్లీ – 276 పరుగులు
19వ ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..
మహేంద్ర సింగ్ ధోని – 599 పరుగులు
ఏబీ డివిలియర్స్ – 404 పరుగులు
కీరన్ పొలార్డ్ – 362 పరుగులు
రవీంద్ర జడేజా – 305 పరుగులు
హార్దిక్ పాండ్యా – 273 పరుగులు
20వ ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..
మహేంద్ర సింగ్ ధోని – 610 పరుగులు
కీరన్ పొలార్డ్ – 378 పరుగులు
రవీంద్ర జడేజా – 276 పరుగులు
రోహిత్ శర్మ – 248 పరుగులు
హార్దిక్ పాండ్యా – 233 పరుగులు
రెండో జట్టుగా సీఎస్‌కే..
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే టీం నాలుగుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో పాటు చెన్నై జట్టు 5 సార్లు రన్నరప్‌గా నిలిచింది. కరోనా కారణంగా గత సీజన్ యూఏఈలో జరిగింది. ఆ తర్వాత ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను ఓడించి చెన్నై టైటిల్ గెలుచుకుంది. ఈసారి ఆ జట్టు 5వ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్ కోసం చెన్నై ఫ్రాంచైజీ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రూ. 16 కోట్లతో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను దక్కించుకుంది. రూ. 12 కోట్లకు కెప్టెన్ ధోనిని రిటైన్ చేసుకుంది. ఈ సీజన్‌లో ధోనీ తన ఫీజులో రూ.3 కోట్ల కోత పడింది. అదే సమయంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, భారత బ్యాట్స్‌మెన్ రితురాజ్ గైక్వాడ్‌లను చెరో రూ. 8 కోట్లకు అట్టిపెట్టుకుంది.
Also Read: MS Dhoni vs Gambhir: ‘ధోనీకి అండగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’
Glenn Maxwell-Vini Raman: ప్రేయసినే పెళ్లాడిన ఆర్‌సీబీ ఆల్ రౌండర్.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..