IPL 2024 Auction: తొలి రౌండ్‌లో వేలంలో కనిపించే ఆటగాళ్లు వీరే.. 4 సెట్లలో ఎవరెవరు ఉన్నారంటే?

|

Dec 18, 2023 | 3:30 PM

IPL 2024 వేలం రేపు అంటే, డిసెంబర్ 19, మంగళవారం జరగనుంది. ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా మొత్తం 10 ఐపీఎల్ జట్లు స్వదేశీ, విదేశీ ఆటగాళ్లపై భారీగా డబ్బులు కురిపించేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఇది 17వ వేలం. విశేషమేమిటంటే ఈసారి తొలి సెట్‌లో కేవలం 7 మంది ఆటగాళ్లు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. అంటే 10 ఫ్రాంచైజీలు తొలి రౌండ్‌లో బ్యాటర్లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. 2వ సెట్‌లో ముఖ్యమైన ఆల్‌రౌండర్లు కనిపించారు.

IPL 2024 Auction: తొలి రౌండ్‌లో వేలంలో కనిపించే ఆటగాళ్లు వీరే.. 4 సెట్లలో ఎవరెవరు ఉన్నారంటే?
Ipl 2024 Auction Sets
Follow us on

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరగనున్న వేలం ప్రక్రియలో మొత్తం 333 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ ఆటగాళ్లను మొత్తం 19 సెట్లుగా విభజించారు. అంటే, ఇక్కడ ఒక్కో సెట్‌లా ఆటగాళ్లను విభజించి వేలం నిర్వహిస్తుంటారు. విశేషమేమిటంటే ఈసారి తొలి సెట్‌లో కేవలం ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు.

అయితే, ఈ జాబితాలో బౌలర్ ఎవరూ లేకపోవడం విశేషం. అంటే 10 ఫ్రాంచైజీలు తొలి రౌండ్‌లో బ్యాటర్లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. 2వ సెట్‌లో ముఖ్యమైన ఆల్‌రౌండర్లు కనిపించారు.

అలాగే, మూడో సెట్‌లో వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్స్ కనిపించారు. అలాగే నాలుగో సెట్ ద్వారా ప్రముఖ పేసర్ల వేలం నిర్వహించనున్నారు. దీని ప్రకారం తొలి 4 సెట్లలో ఆటగాళ్ల జాబితా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

సెట్ 1: హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్ – రూ. 2 కోట్లు), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా – రూ. 2 కోట్లు), కరుణ్ నాయర్ (భారత్ – రూ. 50 లక్షలు), మనీష్ పాండే (భారత్ – రూ. 50 లక్షలు), రోవ్ మన్ పావెల్ (వెస్టిండీస్ – రూ. 1 కోటి), రిలే రోసో (దక్షిణాఫ్రికా- రూ. 2 కోట్లు), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా- రూ. 2 కోట్లు).

సెట్ 2: గెరాల్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా- రూ. 2 కోట్లు, పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా- రూ. 2 కోట్లు), వనిందు హసరంగా (శ్రీలంక- రూ. 1.5 కోట్లు), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్- రూ. 1 కోటి), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్- రూ. 50 లక్షలు), హర్షల్ పటేల్ (భారత్ – రూ. 2 కోట్లు), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్ – రూ. 50 లక్షలు), శార్దూల్ ఠాకూర్ – (భారత్ – రూ. 2 కోట్లు), (క్రిస్ వోక్స్ – ఇంగ్లండ్ – రూ. 2 కోట్లు) రూ.)

సెట్ 3: కె.ఎస్. భారత్ (భారత్ – రూ. 50 లక్షలు), జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా- రూ. 2 కోట్లు), కుసల్ మెండిస్ (శ్రీలంక- రూ. 50 లక్షలు), ఫిలిప్ సాల్ట్ (ఇంగ్లండ్ – రూ. 1.5 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (దక్షిణాఫ్రికా- రూ. 50 లక్షలు రూ. .)

సెట్ 4: లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్ – రూ. 2 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా- రూ. 2 కోట్లు), అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్- రూ. 1 కోటి), దిల్షాన్ మధుశంక (శ్రీలంక- రూ. 50 లక్షలు), శివమ్ మావి (భారత్) – రూ. 50 లక్షలు), చేతన్ సకారియా (భారత్ – రూ. 50 లక్షలు), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా – రూ. 2 కోట్లు), జయదేవ్ ఉనద్కత్ (భారత్ – రూ. 50 లక్షలు), ఉమేష్ యాదవ్ (భారత్ – రూ. 2 కోట్లు).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..