Ipl Auction Live 2022
Full List of Players, IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం రెండు రోజుల పాటు రసవత్తరంగా జరిగింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ ఆక్షన్‌లో 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పేర్లు నమోదు చేసుకోగా.. మొత్తంగా 204 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో పలు సంచలనాలు నమోదయ్యాయి. ఫ్రాంచైజీలు అందరూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తమ జట్లను రూపొందించుకున్నారు. దీనితో పలువురు యువ ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది. అలాగే అంతర్జాతీయ అనుభవం ఉన్న సీనియర్లకు చుక్కెదురు అయింది. ఈ వేలంలో ముంబై బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్ల భారీ ధర పలకగా.. చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహార్‌ను రూ. 14 కోట్లకు, శ్రేయాస్ అయ్యర్‌ను కేకేఆర్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఎక్కువగా టీమిండియా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు అధికంగా డబ్బులు వెచ్చించడం విశేషం. మరోవైపు గత వేలంలో జాక్‌పాట్‌లు కొట్టిన కొందరు ఆటగాళ్లు ఈసారి తుస్సుమనిపించారు. మరి ఐపీఎల్ మెగా వేలం రెండు రోజులు ఎలా జరిగిందో.. ఆక్షన్‌కు సంబంధించిన కీలక పాయింట్స్ మీకోసమే..
రెండు రోజుల వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్స్ వివిధిగా జాబితా ఇదే..
- బ్యాటర్ల లిస్టు ఇలా ఉంది.. శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్, శ్రేయాస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 12.25 కోట్లకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్ రూ. 7 కోట్లకు, డేవిడ్ వార్నర్ రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, మనీష్ పాండే రూ. 4.60 కోట్లకు లక్నో జెయింట్స్, హెట్‌మెయిర్ రూ.8.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, ఊతప్ప చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్లకు, గుజరాత్ టైటాన్స్ జాసన్ రాయ్‌ను రూ. 2 కోట్లకు, పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, ప్రియం గర్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 లక్షలకు, అభినవ్ సదరంగనిని రూ.2.60 కోట్లకు గుజరాత్ టైటాన్స్, దేవల్ద్ బ్రేవిస్‌ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లకు, అశ్విన్ హెబ్బార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 20 లక్షలకు, రాహుల్ త్రిపాఠిని హైదరాబాద్ రూ. 8.50 కోట్లకు, ఎయిడిన్ మార్క్‌రామ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2.60 కోట్లకు, అజింక్యా రహనే రూ. కోటి కోల్‌కతా నైట్ రైడర్స్, మణిదీప్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.10 కోట్లు, రింకు సింగ్ కేకేఆర్ రూ. 55 లక్షలకు, మనన్ వోహ్రా లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షలకు, ఫిన్ అలెన్ బెంగళూరు రూ.80 లక్షలకు, డెవాన్ కాన్‌వే చెన్నై సూపర్ కింగ్స్ రూ. కోటి, రోవ్‌మాన్ పావెల్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.80 కోట్లకు, సుబ్రన్షూ సేనాపతిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 20 లక్షలకు, ఆర్. సమర్థ్ హైదరాబాద్ రూ. 20 లక్షలకు, అభిజీత్ తోమార్‌ను 40 లక్షలకు కేకేఆర్, ప్రథమ్ సింగ్‌ను కేకేఆర్ 20 లక్షలకు, డేవిడ్ మిల్లర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 3 కోట్లకు, హరి నిశాంత్‌ను రూ. 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్, అన్మోల్ ప్రీత్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 20 లక్షలకు, అలెక్స్ హెల్స్‌ను రూ. 1.50 కోట్లకు కేకేఆర్, ఎవిన్ లెవీస్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు, కరుణ్ నాయర్‌ను రూ. 1.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, రాజపక్సను రూ. 50 లక్షలకు పంజాబ్ కింగ్స్, రాహుల్ బుద్ధిని ముంబై ఇండియన్స్ రూ. 20 లక్షలకు, రమేష్ కుమార్‌ను కేకేఆర్ రూ. 20 లక్షలకు, డుస్సేన్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. కోటికి దక్కించుకున్నాయి.
- బౌలర్ల జాబితా విషయానికి వస్తే.. కసిగో రబాడ పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లకు, ట్రెంట్ బౌల్ట్ రాజస్థాన్ రాయల్స్ రూ.8 కోట్లకు, రూ. 6.25 కోట్లకు మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్, టి. నటరాజన్ రూ. 4 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్, దీపక్ చాహార్ చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు, ప్రసిద్ద్ కృష్ణ రాజస్థాన్ రాయల్స్ రూ.10 కోట్లకు, గుజరాత్ టైటాన్స్ ఫెర్గుసన్‌ను రూ. 10 కోట్లకు, జోష్ హజిల్‌వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7.75 కోట్లకు, మార్క్ వుడ్ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 7.5 కోట్లకు, భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 4.20 కోట్లకు, శార్దూల్ ఠాకూర్, రూ. 10.75 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్, ముస్తాఫిజుర్ రెహమాన్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు, కుల్దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు, రాహుల్ చాహార్ పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్లకు, రాజస్తాన్ రాయల్స్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ. 6.5 కోట్లకు, బసిల్ తంపి ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు, కార్తీక్ త్యాగి హైదరాబాద్ రూ. 4 కోట్లకు, ఆకాష్ దీప్ రూ. 20 లక్షలకు బెంగళూరు, కెఎం ఆసిఫ్ రూ. 20 లక్షలకు చెన్నై, ఆవేశ్ ఖాన్ రూ. 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్, ఇషాన్ పోరెల్ పంజాబ్ కింగ్స్ రూ. 25 లక్షలకు, తుషార్ దేశ్‌పాండే రూ. 20 లక్షలు చెన్నై, అంకిత్ సింగ్ రాజ్‌పుత్ రూ. 50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్, నూర్ అహ్మద్ రూ. 30 లక్షలకు గుజరాత్ టైటాన్స్, మురుగన్ అశ్విన్ రూ.1.60 కోట్లకు ముంబై ఇండియన్స్, కెసి కరియప్పా రూ. 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్, శ్రేయాస్ గోపాల్ రూ.75 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, జగదీషా సుచిత్ రూ. 20 లక్షలకు హైదరాబాద్, సాయి కిషోర్ రూ. 3 కోట్లకు గుజరాత్ టైటాన్స్, ఖలీల్ అహ్మద్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 5.25 కోట్లకు, దుషంత చమీరా లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు, చేతన్ సకరియా ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4.20 కోట్లకు, సందీప్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ రూ. 50 లక్షలకు, నవదీప్ సైనీ రూ. 2.60 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, జయదేవ్ ఉనద్కత్ ముంబై ఇండియన్స్ రూ. 1.30 కోట్లకు, మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్ రూ.65 లక్షలకు, షహబాజ్ నదీమ్ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 లక్షలకు, మహీష్ తీక్షనా రూ.70 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్, యష్ డయాల్‌ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ టైటాన్స్, సమర్జీత్ సింగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 20 లక్షలకు, డానియల్ సామ్స్‌ను ముంబై ఇండియన్స్ రూ. 2.60 కోట్లకు, బెహ్రెన్‌డ్రూఫ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 75 లక్షలకు, మెకోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.75 లక్షలకు, టై మిల్స్‌ను రూ. 1.5 కోట్లకు ముంబై ఇండియన్స్, ఆడమ్ మిలనిను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1.9 కోట్లకు, వైభవ్ అరోరాను రూ. 2 కోట్లకు పంజాబ్ కింగ్స్, రసిఖ్ దర్‌ను కేకేఆర్ రూ. 20 లక్షలకు, మొహ్సిన్ ఖాన్‌ను రూ. 20 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్, చమా మిలింద్‌ను బెంగళూరు రూ. 25 లక్షలకు, ప్రశాంత్ సోలంకిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.2 కోట్లకు, సీన్ అబాట్‌ను రూ. 2.40 కోట్లకు హైదరాబాద్, జోసెఫ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2.40 కోట్లకు, మెరిడిట్‌ను రూ. కోటికి ముంబై ఇండియన్స్, బల్ తేజ్ ధందాను పంజాబ్ కింగ్స్ 20 లక్షలకు, సౌరభ్ దూబేను హైదరాబాద్ 20 లక్షలకు, అశోక్ శర్మను కేకేఆర్ రూ. 55 లక్షలు, ఎనిగిడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు, కరణ్ శర్మను బెంగళూరు రూ.50 లక్షలకు, కులదీప్ సేన్‌ను రూ. 20 లక్షలకు, ఫరూఖీని హైదరాబాద్ రూ. 50 లక్షలకు, మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షలకు, తేజస్ బరోకాను రూ. 20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్, కుల్దీప్ యాదవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 20 లక్షలకు, టిమ్ సౌథీని కేకేఆర్ రూ. 1.50 కోట్లకు, వరుణ్ ఆరోన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ, 50 లక్షలకు, ఉమేష్ యాదవ్‌ను రూ. 2 కోట్లకు కేకేఆర్, కౌల్టర్‌నైల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 2 కోట్లకు, సిద్దార్థ్ కౌల్‌ను బెంగళూరు 75 లక్షలకు సొంతం చేసుకున్నాయి.
- వికెట్ కీపర్ల లిస్టు ఇదే.. లక్నో టీం డికాక్‌ను రూ.6.75 కోట్లకు, అంబటి రాయుడి చెన్నై సూపర్ కింగ్స్ రూ. 6.75 కోట్లు, ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లకు, జానీ బెయిర్‌స్టో పంజాబ్ కింగ్స్ రూ. 6.75 కోట్లకు, దినేష్ కార్తీక్ రూ. 5.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నికోలస్ పూరన్ రూ. 10.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ కెఎస్ భరత్ రూ. 2 కోట్లకు, అంజు రావత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.40 కోట్లకు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ రూ. 60 లక్షలకు పంజాబ్ కింగ్స్, షెల్డన్ జాక్సన్ కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.60 లక్షలు, జితేష్ శర్మ పంజాబ్ కింగ్స్ రూ. 20 లక్షలకు, బాబా ఇంద్రజిత్‌ను కేకేఆర్ రూ. 20 లక్షలకు, సామ్ బిల్లింగ్స్‌ను కేకేఆర్ రూ. 2 కోట్లకు, వృద్దిమాన్ సాహా, మ్యాథ్యూ వేడ్‌ను రూ. 1.90 కోట్లు, రూ. 2.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎన్. జగదీషన్‌ను 20 లక్షలకు, విష్ణు వినోద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 50 లక్షలకు, ఫిలిప్స్‌ను హైదరాబాద్ రూ. 1.50 కోట్లకు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు టిమ్ సిఫెర్ట్‌ను, ధృవ్ జురెల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 20 లక్షలకు, ఆర్యన్ జుయాల్‌ను ముంబై 20 లక్షలకు, లువ్నిత్ సిసొడియాను బెంగళూరు 20 లక్షలు సొంతం చేసుకున్నాయి.
- ఆల్‌రౌండర్ల లిస్టు.. రవిచంద్రన్ అశ్విన్ రూ. 5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, ప్యాట్ కమ్మిన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 7.25 కోట్లకు, బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4.4 కోట్లకు, నితీష్ రానా రూ. 8 కోట్లకు కేకేఆర్, జాసన్ హోల్డర్ రూ. 8.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్, హర్షల్ పటేల్ ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు, దీపక్ హుడా లక్నో సూపర్ జెయింట్స్ రూ. 5.75 కోట్లకు, హసరంగా రూ. 10.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వాషింగ్టన్ సుందర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.75 కోట్లకు, కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ రూ. 8.25 కోట్లకు, మిచిల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.5 కోట్లకు, రియాన్ పరాగ్ రూ. 3.80 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, అభిషేక్ శర్మ రూ. 6.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్, సర్ఫరాజ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 20 లక్షలకు, షారుఖ్ ఖాన్ రూ. 9 కోట్లకు పంజాబ్ కింగ్స్, శివమ్ మావి రూ. 7.25 కోట్లకు కేకేఆర్, రాహుల్ తేవాటీయా గుజరాత్ టైటాన్స్ రూ. 9 కోట్లకు, కమలేశ్ నాగరకోటి ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.10 కోటి, పంజాబ్ కింగ్స్ రూ. 3.80 కోట్లకు హర్‌ప్రీత్ బ్రర్, షాబాజ్ అహ్మద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 2.40 కోట్లకు, లియామ్ లివింగ్‌స్టన్ పంజాబ్ కింగ్స్ రూ. 11.50 కోట్లకు, డొమినిక్ డ్రేక్స్ గుజరాత్ టైటాన్స్ రూ. 1.10 కోట్లకు, జయంత్ యాదవ్ రూ. 1.70 కోట్లకు గుజరాత్ టైటాన్స్, విజయ్ శంకర్ రూ.1.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్, ఓడియన్ స్మిత్‌ను రూ. 6 కోట్లకు పంజాబ్ కింగ్స్, మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 4.20కోట్లకు, శివమ్ దూబే రూ. 4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్, కృష్ణప్ప గౌతమ్ రూ. 90 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్, లలిత్ యాదవ్ 65 లక్షలకు, రిపల్ పటేల్ రూ.20 లక్షలకు, యష్ దుల్‌ను రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోగా.. ఎన్.తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ. 1.70 కోట్లకు, మహిపాల్ లోమ్రోర్‌ను రూ.95 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అంకుల్ రాయ్‌ను కేకేఆర్ రూ. 20 లక్షలకు, దర్శన్ నల్కందే రూ.20 లక్షలకు గుజరాత్ టైటాన్స్, సంజయ్ యాదవ్‌ను రూ.50 లక్షలకు ముంబై ఇండియన్స్, రాజ్ అంగద్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 2 కోట్లకు, రాజ్‌వర్ధన్ హంగార్కేర్‌ను రూ. 1.50 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్, జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు, రిషి ధావన్‌ను రూ.55 లక్షలకు పంజాబ్ కింగ్స్, ప్రీటోరియస్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 50 లక్షలకు, షర్ఫెన్ రుతర్‌ఫోర్డ్‌ను బెంగళూరు రూ. కోటికి, శాంత్నర్‌ను రూ. 1.90 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్, రోమరియా షెపెర్డ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.7.75 కోట్లకు, టిమ్ డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8.25 కోట్లకు, ప్రవీణ్ దూబేను రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్, ప్రేరక్ మన్కడ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 20 లక్షలకు, సుయాష్ ప్రభుదేశాయ్‌ను బెంగళూరు రూ. 30 లక్షలకు, ఆయుష్ బదోనిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షలకు, అనీశ్వర్ గౌతమ్ రూ. 20 లక్షలకు బెంగళూరు, చామిక కరుణరత్నేను కేకేఆర్ రూ. 50 లక్షలకు, గుజరాత్ టైటాన్స్ ప్రదీప్ సంగ్వాన్‌ను రూ. 20 లక్షలకు, వృతిక్ చటర్జీని పంజాబ్ కింగ్స్ 20 లక్షలకు, కైల్ మేయర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 50 లక్షలకు, శశాంక్ సింగ్‌ను హైదరాబాద్ 20 లక్షలకు, కరణ్ శర్మను లక్నో 20 లక్షలకు, మొహమ్మద్ అర్షద్ ఖాన్‌ను ముంబై ఇండియన్స్ 20 లక్షలకు, అన్ష్ పటేల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.20 లక్షలు, అనునయ్ సింగ్‌ను రాయల్స్ రూ. 20 లక్షలకు, క్రిస్ జోర్డాన్‌ను రూ. 3.60 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్, ఎల్లిస్‌ను పంజాబ్ రూ. 75 లక్షలకు, రమన్ దీప్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 20 లక్షలకు, అథర్వ్ టైడ్‌ను పంజాబ్ రూ. 20 లక్షలకు, గుర్‌క్రీత్ సింగ్ గుజరాత్ టైటాన్స్ రూ. 50 లక్షలకు, బెన్ని హొవెల్‌ను రూ. 40 లక్షలకు పంజాబ్ కింగ్స్, హృతిక్ షూకెన్‌ను ముంబై రూ. 20 లక్షలకు, భగత్ వర్మను చెన్నై రూ. 20 లక్షలకు, అర్జున్ టెండూల్కర్ రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్, శుభమ్ గర్హ్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 20 లక్షలకు, మహమ్మద్ నబీని కేకేఆర్ రూ. 1 కోటికి, జేమ్స్ నీషమ్‌ను రూ. 1.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, విక్కీ ఒస్త్వల్‌ను ఢిల్లీ 20 లక్షలకు, డారీ మిచిల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 75 లక్షలకు, సాయి సుదర్శన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షలకు, ఫెబిన్ అలెన్ 75 లక్షలకు ముంబై ఇండియన్స్, డేవిడ్ విల్లీని 2 కోట్లకు బెంగళూరు, అమన్ ఖాన్‌ను కేకేఆర్ 20 లక్షలకు కొనుగోలు చేశాయి.
రెండు రోజుల వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల పేర్లు ఇవే..
సురేష్ రైనా, స్టీవ్ స్మిత్, డేవిడ్ మలన్, మార్నస్ లబూషేన్, ఇయాన్ మోర్గాన్, సౌరభ్ తివారీ, ఆరోన్ ఫించ్, చతేశ్వర్ పుజారా, విరాట్ సింగ్, హిమ్మత్ సింగ్, సచిన్ బేబీ, హర్నూర్ సింగ్, హిమాన్షు రానా, రికీ భుయ్, తన్మయ్ అగర్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సమీర్ రిజ్వీ, మార్టిన్ గప్టిల్, లారీ ఎవాన్స్, అపూర్వ్ వాంఖడే, ఆదిల్ రషీద్, ముజీబ్ జద్రాన్, ఇమ్రాన్ తాహిర్, ఆడమ్ జంపా, అమిత్ మిశ్రా, ఎం సిద్ధార్థ్, సందీప్ లామిచానే, ఇషాంత్ శర్మ, షెల్డన్ కాట్రెల్, తబ్రైజ్ షమ్సీ, కైస్ అహ్మద్, ఇష్ సోధి, పీయూష్ చావ్లా, వాసు వట్స్, యష్ ఠాకూర్, అర్జాన్ నాగ్వాస్వాల్లా, ముజ్తబా యూసుఫ్, ఆకాష్ సింగ్, రీస్ టాప్లీ, ఆండ్రూ టై, సందీప్ వారియర్, బెన్ ద్వార్షుయిస్, పంకజ్ జస్వాల్, యువరాజ్ చూడాసమా, మిధున్ సుధేశన్, ధావల్ కులకర్ణి, కేన్ రిచర్డ్‌సన్, సుశాంత్ మిశ్రా, బ్లెస్సింగ్ ముజారబానీ, ముఖేష్ కుమార్ సింగ్, లలిత్ యాదవ్, చింతల రెడ్డి, మతీష పతిరణ, ఆకాష్ మధ్వల్, మహ్మద్ అజారుద్దీన్, విష్ణు సోలంకి, ప్రశాంత్ చోప్రా, కెన్నార్ లూయిస్, బీఆర్ శరత్, రాహుల్ చంద్రోల్, రహ్మానుల్లా గుర్బాజ్, బెన్ మెక్‌డెర్మోట్, షకీబ్ అల్ హసన్, రోస్టన్ చేజ్, చరిత్ అసలంక, అథర్వ అంకోలేకర్, బెన్ కట్టింగ్, పవన్ నేగి, హేడెన్ కెర్, సౌరభ్ కుమార్, షామ్స్ ములాని, ధ్రువ్ పటేల్, అతిత్ షెత్, డేవిడ్ వైస్, కౌశల్ తాంబే, నినాద్ రత్వా, అశుతోష్ శర్మ, మోయిసెస్ హెన్రిక్స్, అకేల్ హోసిన్, స్కాట్ కుగ్గెలీజ్న్, శివంక్ వశిష్ఠ్, గెరాల్డ్ కోయెట్జీ, ప్రత్యూష్ సింగ్, శుభమ్ శర్మ, కె భగత్ వర్మ, కోలిన్ మున్రో, ఉత్కర్ష్ సింగ్, డువాన్ జాన్సెన్, ఖీజర్ దఫేదార్, రోహన్ రాణా, జార్జ్ గార్టన్