
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రతి మ్యాచ్ ఒక కొత్త రికార్డుకు వేదికవుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ అంతటా తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే మే 24న ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ బ్యాట్‌తో కాకుండా, తన ఫీల్డింగ్ విన్యాసంతో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే వచ్చి వెళ్లే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి స్థాయి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం దక్కించుకుని దుమ్ములేపాడు.
ఈ సీజన్ అంతటా వైభవ్ సూర్యవంశీ కేవలం రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చేవాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయానికి అతని స్థానంలో ఒక అదనపు బౌలర్‌ను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి తెచ్చేవారు. దీనికి ప్రధాన కారణం 15 ఏళ్ల వయసున్న వైభవ్, శారీరకంగా కొంచెం లావుగా ఉండటమే. క్రీజులో రన్స్ తీసేటప్పుడు చురుగ్గానే ఉన్నా.. ఫీల్డింగ్‌లో బౌండరీలు ఆపడానికి, డైవ్‌లు కొట్టడానికి అతను అంతగా ఫిట్‌గా లేడని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ భావించింది. అందుకే అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, ముంబైతో జరిగిన లీగ్ చివరి మ్యాచ్‌లో మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచి అతనికి ఫీల్డింగ్ చేసే ఛాన్స్ ఇచ్చింది.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో నెండ్రే బర్గర్ వేసిన రెండో బంతిని ముంబై బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ మిడ్‌వికెట్ వైపు గాల్లోకి లేపాడు. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం కంగారు పడకుండా, అద్భుతమైన టైమింగ్‌తో ఆ క్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ క్యాచ్ అందుకోవడంతోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ వయసులో క్యాచ్ పట్టిన ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ఫీల్డింగ్ ఎఫర్ట్‌ను చూసి డగౌట్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార్ సంగక్కర సైతం లేచి నిలబడి చప్పట్లతో కుర్రాడిని అభినందించాడు.
Vaibhav Sooryavanshi takes the first catch in IPL.
– Vaibhav caught Ryan Rickelton. pic.twitter.com/uS5IqX9jmK
— Maina Singh (@Maina_Singhx77) May 24, 2026
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ మొదట్లో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లను తక్కువ పరుగులకే అవుట్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించింది. కానీ ఆఖర్లో జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ కలిసి ముంబై బౌలర్లను చితక్కొట్టారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికే ముంబై 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ కలిసి 63 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. 12వ ఓవర్లో విల్ జాక్స్ అవుట్ కావడంతో ముంబై ఆశలు అడుగంటాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఫీల్డర్‌గా కొనసాగుతాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఎందుకంటే పిచ్ పరిస్థితులను బట్టి రెండో ఇన్నింగ్స్‌లో కచ్చితంగా ఒక అదనపు స్పెషలిస్ట్ బౌలర్ అవసరం పడుతుంది. కాబట్టి ఎంత చేదుగా అనిపించినా.. వచ్చే నాకౌట్ మ్యాచ్‌ల్లో వైభవ్‌ను మళ్లీ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం చేసి, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..