RCB New Captain: ఆర్‌సీబీ నయా సారథిగా దేశవాళీ సెన్సేషన్.. ట్రోఫీ కొరత తీర్చేస్తాడంటోన్న ఫ్యాన్స్..

RCB Captain For IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) IPL-2025 కి కొత్త కెప్టెన్‌ను నేడు అంటే గురువారం బెంగళూరులో ప్రకటించారు. ఫాఫ్ డు ప్లెసిస్‌ను తర్వాత ఆర్‌సీబీని ట్రోఫీ వైపు నడిపించే బాధ్యతను రజత్ పాటిదార్‌కు అప్పగించారు. అయితే, ముందు నుంచి వస్తోన్న ఊహాగానాల మేరకు కోహ్లీనే మరోసారి సారథ్యం చేపట్టనున్నట్లు భావించారు. కానీ, మరోసారి సారథ్యం చేపట్లే ఉద్దేశ్యం లేదని కోహ్లీ ఇప్పటికే ఫ్రాంచైజీకి తెలియజేసినట్లు చెబుతున్నారు. ఈ వార్తలకు నేటితో తెరపడినట్లైంది.

RCB New Captain: ఆర్‌సీబీ నయా సారథిగా దేశవాళీ సెన్సేషన్.. ట్రోఫీ కొరత తీర్చేస్తాడంటోన్న ఫ్యాన్స్..
Rcb New Captain

Updated on: Feb 13, 2025 | 12:11 PM

RCB Captain For IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) IPL-2025 కి కొత్త కెప్టెన్‌ను నేడు అంటే గురువారం బెంగళూరులో ప్రకటించారు. ఫాఫ్ డు ప్లెసిస్‌ను తర్వాత ఆర్‌సీబీని ట్రోఫీ వైపు నడిపించే బాధ్యతను రజత్ పాటిదార్‌కు అప్పగించారు. అయితే, ముందు నుంచి వస్తోన్న ఊహాగానాల మేరకు కోహ్లీనే మరోసారి సారథ్యం చేపట్టనున్నట్లు భావించారు. కానీ, మరోసారి సారథ్యం చేపట్టే ఆలోచన లేదని కోహ్లీ ఇప్పటికే ఫ్రాంచైజీకి తెలియజేసినట్లు చెబుతున్నారు. ఈ వార్తలకు నేటితో తెరపడినట్లైంది.

బ్యాట్స్‌మన్ రజత్ పాటిదార్ 2021 నుంచి జట్టుతో ఉన్నాడు. నవంబర్‌లో మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ ముగ్గురు ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. ఇందులో రజత్ పాటిదార్ కూడా ఒకడు. 31 ఏళ్ల రజత్ 2024–25 సీజన్‌లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో తన రాష్ట్ర జట్టు మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.

2022 నుంచి 2024 వరకు డు ప్లెసిస్..

మూడు సంవత్సరాలు డు ప్లెసిస్ RCB జట్టుకు నాయకత్వం వహించాడు. 40 ఏళ్ల డు ప్లెసిస్ కోసం ఫ్రాంచైజీ వేలంలో పాల్గొనలేదు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాథమిక ధరకు కొనుగోలు చేసింది.

కోహ్లీ 9 ఏళ్లకుపైగానే..

2013 నుంచి 2021 వరకు విరాట్ కోహ్లీ ఆర్‌సిబికి 9 సంవత్సరాలు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 2021లో, అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత, 2022లో, ఫాఫ్ డు ప్లెసిస్ గత మూడు సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించాడు. 2016లో విరాట్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. మొత్తం మీద, కోహ్లీ 143 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. వాటిలో 66 విజయాలు, 70 ఓటములు ఉన్నాయి. గత మూడు సీజన్లలో, ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో, జట్టు 2022, 2024లో ప్లేఆఫ్‌లకు చేరుకుంది. అయితే 2023లో ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..