IPL 2025 Points Table: ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై.. కట్‌చేస్తే గుజరాత్‌కు లక్కీ ఛాన్స్

IPL 2025 Points Table updated after DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎట్టకేలకు 4 విజయాల తర్వాత మొదటి ఓటమి ఎదుర్కొంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి పడిపోయింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.

IPL 2025 Points Table: ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై.. కట్‌చేస్తే గుజరాత్‌కు లక్కీ ఛాన్స్
Ipl 2025 Playoff Scenario

Updated on: Apr 14, 2025 | 7:40 AM

IPL 2025 Points Table updated after DC vs MI: ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడం ద్వారా తమ వరుస పరాజయాలకు చెక్ పెట్టేసింది. అయితే, ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చిరస్మరణీయమైన రోజుగా మారింది. రెండు మ్యాచ్‌ల ఫలితాలు పాయింట్ల పట్టికపై కీలక ప్రభావాన్ని చూపాయి.

ఢిల్లీ మొదటి స్థానం నుంచి బయటకు..

ముంబై చేతిలో ఢిల్లీ ఓడిపోవడంతో అగ్రస్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది. ఇక వరుస పరాజయాల తర్వాత ముంబై ఆరో స్థానంలో నిలిచింది. హార్దిక్ సేన 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్‌పై ఏకపక్ష విజయంతో బెంగళూరు మూడో స్థానానికి చేరుకుంది. ఆసక్తికరంగా బెంగళూరు ఆడిన నాలుగు ఎవే మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు హోమ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. బెంగళూరు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Video: సిగ్గుందా అసలు.. సెంచరీ చేసినోడికి ఇదేం చెత్త అవార్డ్.. మరోసారి నవ్వులపాలైన పీఎస్‌ఎల్

ఇవి కూడా చదవండి

IPL 2025లో 29వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక..

1) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 4, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 8, నెట్ రన్ రేట్ – +1.081)

2) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 4, ఓటమి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 8, నెట్ రన్ రేట్ – +0.899)

3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 4, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 8, నెట్ రన్ రేట్ – +0.672)

4) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 4, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – +0.162)

5) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 3, ఓడినవి – 3, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – +0.803)

ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ హిస్టరీలో చెత్త ఓపెనర్‌.. సగటు చూస్తే చిరాకే.. ఇకపై కొనడం కష్టమే?

6) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 3, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ +0.065)

7) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 2, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – +0.104)

8) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 2, ఓటమి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -0.838)

9) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 2, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -1.245)

10) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 1, ఓటమి – 5, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్- -1.554).

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..