
Lucknow Super Giants Captain Rishabh Pant Flop: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యేకంగా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో లక్నో జట్టు తనకోసం వెచ్చించిన రూ. 27 కోట్లకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లలో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2025లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండడం అటు ఫ్రాంచైజీతోపాటు ఇటు ఫ్యాన్స్ కూడా ఏకిపారేస్తున్నారు. నెటిజన్లు మాత్రం కెప్టెన్‌గా పీకిపారేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు ఆరంభం అంతగా బాగోలేదు. తొలి దశలోనే మిచెల్ మార్ష్ జీరోకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఐడెన్ మార్క్రమ్ బౌండరీలతో చెలరేగాడు. కానీ అతను భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పంత్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. కానీ, కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
గ్లెన్ మాక్స్వెల్ లెగ్ సైడ్ వైపు ఒక లెంగ్త్ బాల్ సంధించాడు. పంత్ బంతిని మిస్ టైమింగ్ చేశాడు. షార్ట్-ఫైన్ లెగ్ వద్ద యుజ్వేంద్ర చాహల్ ఒక సింపుల్ క్యాచ్ పట్టాడు. దీంతో మాక్స్వెల్ పంత్‌ను అవుట్ చేయడం ఓ అలవాటుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. 4 ఇన్నింగ్స్ లలో పంత్‌ను మూడుసార్లు అవుట్ చేశాడు.
Full PR and sympathy
Zero PerformanceRishabh Pant is Rohit Sharma lite#LSGvsPBKS pic.twitter.com/qXGSdLucmf
— Aarav (@sigma__male_) April 1, 2025
రూ. 27 కోట్లు దక్కించుకున్న పంత్.. ఈ సీజన్‌లోకి వచ్చే ముందే తీవ్ర ఒత్తిడిలో కూరుకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ కావడంతో పంత్ బ్యాటింగ్‌పై ఒత్తిడి కనిపించింది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు చేయగా, పంజాబ్‌పై కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..