చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్‌కు తమ స్క్వాడ్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈసారి జట్టులోనుంచి ఎవరిని ఉంచుకుంటారు ఎవరినీ రిటైన్ చేసుకుంటారు అని సీఎస్‌కే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా CSK రిటైన్ చేసుకోనున్న సంగతి మనందరీకి తెలిసిందే..
రవీంద్ర జడేజా :
MS ధోనీతో తర్వాత సీఎస్‌కేకి కీలక ఆటగాడిగా రవీంద్ర జడేజా ఉన్నాడు. దీంతో జడేజాను కచ్చితంగా సీఎస్‌కే రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. జడ్డు భాయ్ తన కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఐపీఎల్‌లో తన రాణించగలుగుతున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ :
గత సీజన్ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను ఫ్రాంచైజీ కొనసాగించనున్నట్లు సమాచారం. ఈ 27 ఏండ్ల యంగ్ ప్లేయర్ ఐపీఎల్‌లో 583 పరుగులు చేశాడు.
శివమ్ దూబే :
శివమ్ దూబే కూడా సీఎస్‌కే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గత రెండు సీజన్లలో 800కు పైగా పరుగులు చేసిన దూబే CSK మిడిల్ ఆర్డర్ ప్లేయర్‌గా బాగా రాణిస్తున్నాడు. దీంతో ఫ్రాంచైజీ శివమ్ దూబేను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది.
MS ధోని : సీఎస్‌కే అంటే ధోని.. ధోని అంటే సీఎస్‌కే.. ఫ్రాంచైజీ కొనుగోలు చేసే మొదటి ఆటగాడు ధోనినే.. కొత్త ‘అన్‌క్యాప్డ్ ప్లేయర్’ నియమాన్ని మళ్లీ ప్రవేశపెట్టడంతో, ధోనిని రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోనుంది.
టీమ్‌లో నెంబర్.1 ప్లేయర్ ఎంపికలో రవీంద్ర జడేజా ఉన్నట్లు తెలుస్తుంది.