SRH vs MI: ఉప్పల్‌లో బ్యాటర్లు వర్సెస్ బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?

Sunrisers Hyderabad vs Mumbai Indians, 41st Match: ఐపీఎల్ 2025లో భాగంగా 41వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ 7 మ్యాచ్‌లు ఆడింది. అందులో 2 గెలిచి, 5 ఓడిపోయింది.

SRH vs MI: ఉప్పల్‌లో బ్యాటర్లు వర్సెస్ బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
Srh Vs Mi Ipl 2025

Updated on: Apr 23, 2025 | 7:29 AM

Sunrisers Hyderabad vs Mumbai Indians, 41st Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈసారి మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ ఆరెంజ్ ఆర్మీని ఓడించడం ముంబైకి అంత సులభం కాదు. ఇదే మైదానంలో, హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ పై 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ, ఆ తరువాత ఈ సీజన్‌లో హైదరాబాద్ ప్రదర్శన ప్రత్యేకంగా లేదు. కమ్మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs MI) 7 మ్యాచ్‌ల్లో 5 ఓడిపోయింది. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఇక్కడికి వస్తోంది. హైదరాబాద్ వాతావరణం, పిచ్ నివేదిక ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..

పిచ్ పరిస్థితి ఎలా ఉంటుంది?

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (SRH vs MI) మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మైదానం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. బౌలర్లకు మాత్రం స్మశానవాటికలా ఉంటుంది. ఇక్కడి పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. కాబట్టి బ్యాటర్లు రెచ్చిపోతూ, భారీ స్కోర్లను నమోదు చేస్తుంటారు.

అదే సమయంలో, బౌలర్లకు ఈ పిచ్ నుంచి ఎటువంటి సహాయం లభించదు. దీని కారణంగా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. మొదటి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 230 పరుగులు కాగా, రెండవ ఇన్నింగ్స్‌లో ఈ సంఖ్య 186 పరుగులకు పడిపోతుంది. కానీ, ఈ సీజన్‌లో జరిగిన 4 మ్యాచ్‌లలో, రెండు మ్యాచ్‌లను మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. రెండు మ్యాచ్‌లు పరుగులను ఛేదించే జట్టుకు అనుకూలంగా సాగాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

వాతావరణం ఎలా ఉంటుంది?

సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (SRH vs MI) మధ్య ఈ మ్యాచ్ బుధవారం (ఏప్రిల్ 23) రాత్రి 7:30 గంటల నుంచి జరుగుతుంది. ఈ హోరాహోరీ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు కూడా ఈ మ్యాచ్ సమయంలో వర్షం పడకూడదని ప్రార్థిస్తున్నారు. బుధవారం మ్యాచ్ రోజున, గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షం పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో అభిమానులు ఈ మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించవచ్చు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..