ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో ఆతిథ్య జట్టు విజయాల ట్రెండ్‌కు ఎట్టకేలకు తెరపడింది. సొంత గడ్డపై కోల్‌కతా చేతిలో ఆర్‌సీబీ చిత్తుగా ఓడిపోయింది. RCB ఓటమిలో ఇద్దరు అయ్యర్లు ప్రధాన పాత్ర పోషించారు. వారే కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్. శుక్రవారం నాటి మ్యాచ్‌లో వీరిద్దరూ చక్కటి ఆటతీరుతో కోల్ కతాను విజయ తీరాలకు చేర్చారు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో శ్రేయస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 39 పరుగులు చేశాడు. వీరిద్దరి ధనాధన్ బ్యాటింగ్ కారణంగానే ఆర్సీబీ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసింది కోల్ కతా. అదికూడా 19 బంతులు మిగిలి ఉండగానే. అయితే ఈ ఇద్దరు అయ్యర్లపై అభిమానులు చాలా గందరగోళానికి గురవుతున్నారు. శ్రేయస్, వెంకటేశ్ అన్నదమ్ములా అన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.
శ్రేయాస్ అయ్యర్ మహారాష్ట్రలోని చెంబూర్‌లో జన్మించగా , వెంకటేష్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. కాబట్టి వీరిద్దరూ అన్నదమ్ములు కారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ ఇద్దరూ ఒకే నెలలో జన్మించారు. శ్రేయాస్ 1994 డిసెంబర్ 6న జన్మించగా, వెంకటేష్ 1994 డిసెంబర్ 25న వెంకటేశ్ అయ్యర్ జన్మించాడు. అంటే వెంకటేష్ కంటే శ్రేయాస్ 19 రోజులు పెద్ద. దీనికి మించి వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు.
🗣Venkatesh Iyer to Shreyas Iyer: “When you came in, I think the communication amongst us was amazing. We discussed about which bowler to take on and which end to look for shots. That really helped us.” pic.twitter.com/bymCUa8Ixo
— KnightRidersXtra (@KRxtra) March 30, 2024
After winning the match against RCB, Shreyas Iyer was seen sharing his experience with Venkatesh Iyer and Mayank Dagar.#ShreyasIyer || #RCBvsKKR pic.twitter.com/pDe4gsj9GE
— Pick-up Shot (@96ShreyasIyer) March 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..