IPL 2024: మళ్లీ ధనాధన్‌ లీగ్‌లోకి సురేశ్‌ రైనా.. ఆ జట్టులోకి చేరనున్న ‘మిస్టర్‌ ఐపీఎల్‌’

|

Dec 28, 2023 | 4:21 PM

ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే.. రైనాకు ఐపీఎల్‌లో ఆటగాడిగా అనుమతి లేదు. ఎందుకంటే అతను ఇప్పటికే బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ పొంది ఇతర లీగ్‌లలో కనిపించాడు. యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్, లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ వంటి టోర్నీల్లోనూ రైనా ఆడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇతర లీగ్‌లలో పాల్గొన్న టీమిండియా క్రికెటర్లకు ఐపీఎల్‌ ఆడే అవకాశం లేదు.

IPL 2024: మళ్లీ ధనాధన్‌ లీగ్‌లోకి సురేశ్‌ రైనా.. ఆ జట్టులోకి చేరనున్న మిస్టర్‌ ఐపీఎల్‌
Suresh Raina
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 ద్వారా సురేశ్ రైనా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ధనాధన్‌ లీగ్‌లో వేలాది పరుగులు సాధించిన రైనా ఇప్పుడు సరికొత్త రోల్‌లో కనిపించనున్నాడు. ఐపీఎల్ 2024లో సురేష్ రైనా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని సమచారం. 2021 తర్వాత సురేశ్ రైనా ఐపీఎల్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2022, 2023లో సీజన్‌ లో లక్నో సూపర్‌జెయింట్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. దీంతో ఎల్‌ఎస్‌జీ టీమ్ మెంటార్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పుడీ స్థానంలో రైనాను లక్నో ఫ్రాంచైజీ మెంటార్‌గా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే.. రైనాకు ఐపీఎల్‌లో ఆటగాడిగా అనుమతి లేదు. ఎందుకంటే అతను ఇప్పటికే బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ పొంది ఇతర లీగ్‌లలో కనిపించాడు. యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్, లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ వంటి టోర్నీల్లోనూ రైనా ఆడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇతర లీగ్‌లలో పాల్గొన్న టీమిండియా క్రికెటర్లకు ఐపీఎల్‌ ఆడే అవకాశం లేదు.

ఈ నిబంధనల కారణంగానే రైనా 2022 నుండి ఐపీఎల్‌ కు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు సురేశ్ రైనా మెంటార్ పదవితో మళ్లీ ఐపీఎల్‌లోకి వస్తాడో లేదో చూడాలి. సురేష్ రైనా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఖాన్ తో మిస్టర్ ఐపీఎల్..

కిచ్చా సుదీప్ తో సురేశ్ రైనా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..