IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్‌పై తిరుగులేని విజయం.. కట్‌చేస్తే.. పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. గుజరాత్‌కు భారీ షాక్..

IPL 2024, Points Table Update: ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు ఎగబాకింది. అదే సమయంలో ముంబై విజయంతో పంజాబ్‌తో పాటు గుజరాత్‌ కూడా భారీగా నష్టపోయాయి. ప్రస్తుతం పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఓసారి చూద్దాం..

IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్‌పై తిరుగులేని విజయం.. కట్‌చేస్తే.. పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. గుజరాత్‌కు భారీ షాక్..
Mumbai Indians
Follow us

|

Updated on: Apr 19, 2024 | 12:02 PM

IPL 2024, Points Table Update: ఐపీఎల్ 2024 33వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించడం ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు ఎగబాకింది. కాగా పంజాబ్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై 9 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ విజయంతో ముంబై రెండు స్థానాలు ఎగబాకింది. పంజాబ్‌తో పాటు గుజరాత్‌ టైటాన్స్‌ కూడా ఓటమి పాలైంది. ముంబై జట్టు 9వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకగా, ఓటమి తర్వాత పంజాబ్ ఒక స్థానం కోల్పోయి 8వ స్థానం నుంచి 9వ స్థానానికి, గుజరాత్ జట్టు 7వ స్థానం నుంచి 8వ స్థానానికి దిగజారింది.

రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ముంబై, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ జట్టు 19.1 ఓవర్లలో 183 పరుగులకే పరిమితమైంది. ముంబై విజయంలో నిజమైన హీరో జస్ప్రీత్ బుమ్రా 21 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

నెట్ రన్ రేట్ కారణంగా భారీ వ్యత్యాసం..

జట్టు స్థానం జట్టు  మ్యాచ్‌లు  విజయాలు  ఓటమి  పాయింట్లు  నికర రన్ రేట్ 
1 రాజస్థాన్ రాయల్స్  7 6 1 12 0.677
2 కోల్‌కతా నైట్ రైడర్స్ 6 4 2 8 1.399
3 చెన్నై సూపర్ కింగ్స్  6 4 2 8 0.726
4 సన్‌రైజర్స్ హైదరాబాద్  6 4 2 8 0.502
5 లక్నో సూపర్ జెయింట్స్  6 3 3 6 0.038
6 ఢిల్లీ క్యాపిటల్స్ 7 3 4 6 -0.074
7 ముంబై ఇండియన్స్  7 3 4 6 -0.133
8 గుజరాత్ టైటాన్స్ 7 3 4 6 -1.303
9 పంజాబ్ కింగ్స్ 7 2 5 4 -0.251
10 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  7 1 6 2 -1.185

లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, మొత్తం నాలుగు జట్లకు 66 పాయింట్లు ఉన్నాయి. అయితే, లక్నో నాలుగింటిలో మెరుగైన నెట్ రన్ రేట్‌ను కలిగి ఉంది. కాగా, రన్ రేట్ కారణంగా గుజరాత్ జట్టు ఒక స్థానం దిగజారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఈ ఫొటోలోని అంకెల మధ్య వేరే నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం
ఈ ఫొటోలోని అంకెల మధ్య వేరే నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం
వాలంటీర్లకు డెడ్‌లైన్ విధించిన టెక్కలి వైసీపీ అభ్యర్థి
వాలంటీర్లకు డెడ్‌లైన్ విధించిన టెక్కలి వైసీపీ అభ్యర్థి
చవకైన ధరలో 5జీ ఫోన్.. ఐఫోన్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్లు..
చవకైన ధరలో 5జీ ఫోన్.. ఐఫోన్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్లు..
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
పొలిమేర 2 హీరోయిన్‏కు అత్యున్నత పురస్కారం..
పొలిమేర 2 హీరోయిన్‏కు అత్యున్నత పురస్కారం..
కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెప్పిన భర్త..!
కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెప్పిన భర్త..!
చుండ్రు సమస్యతో విసుగెత్తిపోయారా.. పసుపుతో చెక్ పెట్టండిలా..
చుండ్రు సమస్యతో విసుగెత్తిపోయారా.. పసుపుతో చెక్ పెట్టండిలా..
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఈవెంట్‌లను ప్లాన్‌
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఈవెంట్‌లను ప్లాన్‌
గుజరాత్ వేదికగా రాహుల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
గుజరాత్ వేదికగా రాహుల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
KCPDరా చిచ్చా.. పాత కూలర్‌ను ఏసీగా మార్చేశాడు.. ఇక ఇల్లంతా కూల్.!
KCPDరా చిచ్చా.. పాత కూలర్‌ను ఏసీగా మార్చేశాడు.. ఇక ఇల్లంతా కూల్.!