IPL 2024: తలా వర్సెస్ కింగ్.. ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసిందోచ్.. తొలి మ్యాచ్‌‌లో ఆ రెండు జట్లు ఢీ..

IPL 2024 Schedule: నెల రోజుల్లో ధనాధన్ క్రికెట్ షూరూ కానుంది. భారత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ఏడాది ఐపీఎల్ 2024కి షెడ్యూల్ వచ్చేసింది. అయితే ఇప్పుడు కేవలం 17 రోజుల షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది బీసీసీఐ. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభం కాబోతోంది. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరగనుంది.

IPL 2024: తలా వర్సెస్ కింగ్.. ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసిందోచ్.. తొలి మ్యాచ్‌‌లో ఆ రెండు జట్లు ఢీ..
Csk Vs Rcb

Updated on: Feb 22, 2024 | 6:03 PM

రిచెస్ట్ క్రికెట్ లీగ్‌కు సమయం ఆసన్నమైంది. మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కాబోతోంది. మార్చి 22వ తేదీన మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరగనుంది. అనంతరం అహ్మదాబాద్ వేదికగా 2023 సీజన్ ఫైనలిస్ట్ గుజరాత్ టైటాన్స్, హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్‌లో తలబడనున్నాయి. మొదటి 17 రోజులకు అనగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగబోయే మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. మార్చి 22 – ఏప్రిల్ 7 మధ్య 21 మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో నాలుగు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు ఉన్నాయి. మార్చి 23న మొదటి డబుల్ హెడ్డర్ మ్యాచ్‌ల్లో భాగంగా మధ్యాహ్నం మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలబడనున్నాయి. ఇక అదే రోజు కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక మార్చి 24 ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడుతుంది. మొదటి ఫేజ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన రెండు హోం మ్యాచ్‌లు విశాఖపట్నంలో ఆడనుంది. కాగా, కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ప్రకటించగానే.. మిగిలిన మ్యాచ్‌లకు కూడా షెడ్యూల్ ప్రకటిస్తుంది బీసీసీఐ.

చెన్నై మ్యాచ్‌లు ఇలా..

  • చెన్నై vs బెంగళూరు – చెపాక్: మార్చి 22
  • చెన్నై vs గుజరాత్ – చెపాక్: మార్చి 26
  • చెన్నై vs ఢిల్లీ – వైజాగ్: మార్చి 31
  • చెన్నై vs హైదరాబాద్ – హైదరాబాద్: ఏప్రిల్ 5

హైదరాబాద్ మ్యాచ్‌లు ఇలా..

  • కోల్‌కతా vs హైదరాబాద్ – కోల్‌కతా: మార్చి 23
  • ముంబై vs హైదరాబాద్ – హైదరాబాద్: మార్చి 27
  • గుజరాత్ vs హైదరాబాద్ – అహ్మదాబాద్: మార్చి 31
  • చెన్నై vs హైదరాబాద్ – హైదరాబాద్: ఏప్రిల్ 5

బెంగళూరు మ్యాచ్‌లు ఇలా..

  • చెన్నై vs బెంగళూరు – చెన్నై: మార్చి 22
  • పంజాబ్ vs బెంగళూరు – బెంగళూరు: మార్చి 25
  • కోల్‌కతా vs బెంగళూరు – బెంగళూరు: మార్చి 29
  • లక్నో vs బెంగళూరు – బెంగళూరు: ఏప్రిల్ 2