MI vs RR, IPL 2024: చెలరేగిన చాహల్, బౌల్ట్.. కుదేలైన ముంబై బ్యాటర్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

|

Apr 01, 2024 | 9:52 PM

సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ చతికిల పడింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (3/11), ట్రెంట్ బౌల్ట్ (3/22) , బర్గర్ (2/32) ధాటికి కనీసం ఏ ఒక్క ముంబై బ్యాటర్ కూడా అర్ధసెంచరీ చేయలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై 9 వికెట్ల నష్టానికి కేవలం..

MI vs RR, IPL 2024: చెలరేగిన చాహల్, బౌల్ట్.. కుదేలైన ముంబై బ్యాటర్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
Mumbai Indians vs Rajasthan Royals,
Follow us on

సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ చతికిల పడింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (3/11), ట్రెంట్ బౌల్ట్ (3/22) , బర్గర్ (2/32) ధాటికి కనీసం ఏ ఒక్క ముంబై బ్యాటర్ కూడా అర్ధసెంచరీ చేయలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముందుగా బౌల్ట్ ధాటికి రోహిత్‌ శర్మ, నమన్‌ ధీర్, డెవాల్డ్ బ్రెవీస్‌ డకౌట్‌ అయ్యారు. ఆ తర్వాత చాహల్ స్పిన్ వలలో ముంబై బ్యాటర్లు చిక్కుకున్నారు. ఇషాన్‌ కిషన్‌ (16), టిమ్‌ డేవిడ్‌ (17), కోయెట్జీ (4), పీయూష్‌ చావ్లా (3) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34), తెలుగబ్బాయి తిలక్ వర్మ (32) రాణించడంతో ముంబై స్కోరు 100 పరుగులు దాటింది.  ఈమ్యాచ్ లో  టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు.  అయితే బౌల్ట్ ధాటికి మొదటి  ముగ్గురు ముంబై బ్యాటర్లు  ఖాతా తెరవలేకపోయారు. కేవలం 14 పరుగుల వద్ద మూడు వికెట్లు పడ్డాయి. విశేషమేమిటంటే ఈ ముగ్గురు తమ ఖాతా తెరవలేకపోయారు. రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ కు తొలి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ అతన్ని సున్నా రన్స్ కే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన నమన్ ధీర్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. బోల్ట్ ఖాతాలోకే ఈ వికెట్ఆ కూడా చేరింది. ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ కూడా బోల్తా పడ్డాడు. ఈ ఇన్నింగ్స్ లో సున్నాకి ఔట్ అయిన మూడో ఆటగాడిగా కూడా నిలిచాడు. తిలక్ వర్మ, ఇషాన్‌లపై అంచనాలు ఉన్నాయి.

 

క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా  ఇషాన్ కిషన్ 16 పరుగుల వద్ద ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఐదో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ దూకుడుగా ఆడుతున్న సమయంలో హార్దిక్ పాండ్యా వికెట్ సమర్పించుకున్నాడు.  34 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాది రోవ్ మన్ పావెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత పియూష్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ కూడా 32 పరుగుల వద్ద ముగిసింది. గెరాల్డ్ కోయెట్జీ 4 పరుగుల వద్ద అవుటయ్యాడు. టిమ్ డేవిడ్ కూడా 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

డెవాల్డ్ బ్రూయిస్, నువాన్ తుషార, రొమారియో షెపర్డ్, నెహాల్ వధేరా, షామ్స్ ములానీ.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి  జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హీట్‌మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రోవ్‌మన్ పావెల్, తనుష్ కొటియన్, కుల్దీప్ సేన్, శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..