హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 17వ సీజన్‌ను నిరాశాజనకంగా ప్రారంభించింది. ఆ జట్టు వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఐపీఎల్ 17 సీజన్ ప్రారంభానికి ముందు రోహిత్ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించారు. పాండ్యా నాయకత్వంలోనే ముంబై వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో అభిమానులు హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్నారు. ముంబైలో 2 గ్రూపులు ఏర్పడ్డాయంటూ ప్రచారం సాగుతోంది. కెప్టెన్‌ని మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ముంబై ఇండియన్స్ కు, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ఓ సంతోషకరమైన వార్త అందింది. అదేంటంటే వరల్డ్ టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో ఆడేందుకు ఏప్రిల్ 3 (బుధవారం) NCA నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. సూర్యకుమార్ ఫిట్ గా ఉన్నారని ఎన్ సీఏ ప్రకటించింది. దీంతో ముంబై అభిమానులకు పెద్ద ఊరట లభించింది. ఇది మాత్రమే కాదు, సూర్యకుమార్ ఇప్పుడు ముంబై ఇండియన్స్‌లో ఎప్పుడు చేరతాడు? దీనికి సంబంధించిన సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. క్రిక్‌బజ్ ప్రకారం, ఏప్రిల్ 5న అంటే శుక్రవారమే సూర్య ముంబై జట్టులో జాయిన్ అవుతాడు.
ముంబై తన నాలుగో మ్యాచ్‌ని ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ముంబై తన సొంత మైదానంలో అంటే వాంఖడే స్టేడియంలో ఆడనుంది. సూర్యకుమార్‌కు వాంఖడే స్టేడియం కూడా సొంత మైదానం. కాబట్టి సూర్య తన సొంత గ్రౌండ్ లోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే, ఏప్రిల్ 7 (ఆదివారం) ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో సూర్య బరిలోకి దిగనున్నాడు.
🚨🚨Suryakumar Yadav is set to link up with the Mumbai Indians squad on April 5
Details: https://t.co/dWczlJNHVe#MIvDC #IPL2024 pic.twitter.com/a8XCjNHDcM
— Cricbuzz (@cricbuzz) April 4, 2024
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, విష్ణు వినోద్, నెహాల్ వధేరా, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, తిలాకియో షెపర్డ్, వర్మ, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, ల్యూక్ వుడ్, క్వేనా మఫాకా.
Surya bhau is comming back 🔥🔥
No MI & Surya fans will pass it without liking. ❤#SuryakumarYadav pic.twitter.com/fZ3h45MchZ— InSights (@InfoUnveilled) April 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..