IPL 2024: బీసీసీఐ నిబంధన.. ఇంకా టీమ్‌తో చేరని కేఎల్ రాహుల్.. ఐపీఎల్ ఆడడంపై లక్నో కెప్టెన్ ఏమన్నాడంటే?

|

Mar 17, 2024 | 11:53 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. అయితే ఈ ప్రాక్టీస్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం కనిపించలేదు.

IPL 2024: బీసీసీఐ నిబంధన.. ఇంకా టీమ్‌తో చేరని కేఎల్ రాహుల్.. ఐపీఎల్ ఆడడంపై లక్నో కెప్టెన్ ఏమన్నాడంటే?
KL Rahul
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. అయితే ఈ ప్రాక్టీస్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం కనిపించలేదు. అంటే రాహుల్ ఇంకా జట్టుతో చేరలేదు. బదులుగా, KL రాహుల్ జాతీయ క్రికెట్ అకాడమీలో కొనసాగుతున్నాడు. దీనికి కారణం ఫిట్‌నెస్ పరీక్ష. ఐపీఎల్‌ ముందు గాయపడిన టీమిండియా ఆటగాళ్లు తప్పనిసరిగా ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలని బీసీసీఐ కచ్చితమైన నిబంధనను విధించింది. ఈ రూల్ ప్రకారం రిషబ్ పంత్ ఇప్పటికే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. అయితే కేఎల్ రాహుల్ ఇప్పటికీ ఎన్‌సీఏలోనే ఉంటూ కఠోరమైన శిక్షణలో పాల్గొంటున్నాడు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడిన కేఎల్ రాహుల్ గాయం కారణంగా సిరీస్ మధ్యలో‌ నుంచి వైదొలిగాడు. కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ ఆడాలంటే కేఎల్ఆర్ ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకే రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

అయితే మరో రెండు రోజుల్లో కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. అందులో పూర్తి ఫిట్ గా ఉన్నట్లు తేలితనే రాహుల్‌ ఐపీఎల్ లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి KL రాహుల్ IPL భవిష్యత్తు తదుపరి ఫిట్‌నెస్ పరీక్షపై ఆధారపడి ఉంది. మరోవైపు రాహుల్ మాత్రం ఐపీఎల్ ఆడతానంటూ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. త్వరలోనే లక్నో జట్టు సభ్యులందరితో కలుస్తానంటున్నాడు.

ఇవి కూడా చదవండి

 

 

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు

కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, దేవదత్ పడిక్కల్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, యశ్ థాకూర్ , ప్రేరక్ మన్కడ్, అమిత్ మిశ్రా, మయాంక్ యాదవ్, షమర్ జోసెఫ్, మొహ్సిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, అర్షిన్ కులకర్ణి, శివమ్ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్ విల్లీ, అష్టన్ టర్నర్, మహ్మద్ అర్షద్ ఖాన్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..