ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూన్ నెల మొదటి వారంలో ఈ పొట్టి ప్రపంచ కప్ స్టార్ట్ కానుంది. జూన్ 5 భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. ఐపీఎల్ సత్తా చాటిన ప్లేయర్లను కూడా పరిగణణలోకి తీసుకుని వారికి కూడా టీమ్ లో స్థానం కల్పించారు. అయితే ప్రపంచకప్ జట్టును ఇలా ప్రకటించారో లేదో ఎంపికైన ప్లేయర్లలో కొందరు ఫామ్ కోల్పోయారు. అప్పటివరకు అదరగొట్టిన ఆటగాళ్లు అనూహ్యంగా తేలిపోయారు. పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. దీంతో టీమిండియా ప్రపంచకప్ జట్టులో వారి స్థానం ప్రశ్నార్థకమైంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే. ఐపీఎల్- 2024లో ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన దూబే.. రెండో అర్ధభాగంలో పూర్తిగా తేలిపోయాడు. ఈ సీజన్ మొదటి 9 మ్యాచ్ ల్లో 172.4 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేసిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి 9 మ్యాచ్ ల్లో ఏకంగా 26 సిక్సర్లు బాదిన ఈ ఆల్ రౌండర్.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 2 సిక్సర్లు మాత్రమే కొట్టాడం గమనార్హం.
దూకుడైన ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న దూబే స్నిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడని పేరుంది. కానీ ఇప్పుడు అదే స్పిన్ ఉచ్చులో విలవిల్లాడుతున్నాడీ ఆల్ రౌండర్. ఇక ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో దూబే 15 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో దూబేపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ప్రకటించిన జట్టులో మే 25లోపు మార్పులు చేసుకోవచ్చు. ఈ క్రమంలో మెయిన్ టీమ్ లో ఉన్న దూబేకు ఉద్వాసన తప్పకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. అతని స్థానంలో రిజర్వ్ జాబితాలో ఉన్న ఫినిషర్ రింకూ సింగ్ ని ప్రధాన జట్టులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్‌దీప్ సింగ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..