ఈ ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ జట్టుకు తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆఖరి మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది. కెప్టెన్ మార్పు కూడా ముంబై ఇండియన్స్‌కు ఉపయోగపడలేదు. కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాగా ఈ సీజన్‌లోని చివరి మ్యాచ్ తర్వాత ఆటగాళ్లను కలిసేందుకు ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు. ఇది తమకు నిరాశకరమైన సీజన్ అని బాధపడిన నీతా అంబానీ, రాబోయే టీ20 ప్రపంచ కప్ లో ఆడనున్న ముంబై ఆటగాళ్లకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మా అందరికీ నిరాశాజనకమైన సీజన్. మనం కోరుకున్నట్టు జరగలేదు. కానీ నేను ఇప్పటికీ ముంబై ఇండియన్స్‌కు పెద్ద అభిమానిని. ఓనర్‌గా మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించడం నా గౌరవం. ఏం జరిగిందో సమీక్షించి ఆలోచిస్తాం. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున ఆడనున్న ముంబై జట్టు ఆటగాళ్లకు శుభాకాంక్షలు. రోహిత్, హార్దిక్, సూర్య, జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచకప్ లో అమోఘంగా రాణించాలి’ అని నీతా అంబానీ ఆకాంక్షించారు.
కాగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో 10వ ఓటమి ఎదురైంది. ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మకు ఇదే ఆఖరి సీజన్ కావచ్చని చర్చ జరుగుతోంది. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. క్రికెట్ కంటే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పు, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు, జట్టులోని అంతర్గత కక్ష కారణంగా ఈ ఏడాది ఎక్కువగా చర్చనీయాంశమైంది. వచ్చే సీజన్ ప్రారంభానికి ముందే ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. మరి రోహిత్ శర్మ ముంబై జట్టులో కొనసాగుతాడో లేదో చూడాలి.
Mrs. Nita Ambani talks to the team about the IPL season and wishes our boys all the very best for the upcoming T20 World Cup 🙌#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @hardikpandya7 | @surya_14kumar | @Jaspritbumrah93 pic.twitter.com/uCV2mzNVOw
— Mumbai Indians (@mipaltan) May 19, 2024
तोडफोड from the get-go, a 𝐭𝐲𝐩𝐢𝐜𝐚𝐥 𝐑𝐨 𝐩𝐞𝐫𝐟𝐨𝐫𝐦𝐚𝐧𝐜𝐞 was on display in #MIvLSG 💪💙#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/sddic4we6i
— Mumbai Indians (@mipaltan) May 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..