
Lucknow Super Giants vs Punjab Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా 11వ మ్యాచ్ శనివారం (మార్చి 30) పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. గత మ్యాచ్‌లో లక్నో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాబట్టి పంజాబ్ కింగ్స్‌పై లక్నో తిరిగి విజయపథంలోకి రావాలంటే, ఈ జట్టుపై ప్రతి విభాగంలోనూ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇక పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో సీజన్‌ను ప్రారంభించింది. కానీ తర్వాతి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా కూడా గత ఓటమిని మరిచిపోయి ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటోంది. కాగా ఈ మ్యాచ్ లో లక్నోకు సారథిగా నికోలస్ పూరన్ వ్యవహరించనున్నాడు.
ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ నికోలస్ పూరన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
🚨 𝙏𝙤𝙨𝙨 𝙐𝙥𝙙𝙖𝙩𝙚 🚨#LSG has won the toss & elected to bat first 👊#LSGvPBKS #TATAIPL #IPLonJioCinema #JioCinemaSports pic.twitter.com/68nOMrkHk5
— JioCinema (@JioCinema) March 30, 2024
Lucknow’s first-ever Tifo to celebrate the Super Giants – now ready to be unveiled in the Ekana stands! 😍🔥
This is Lucknow. This is UP! 💙 pic.twitter.com/F6I4SKcChT
— Lucknow Super Giants (@LucknowIPL) March 30, 2024
క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.
ఇంపాక్ట్ ప్లేయర్: ఆష్టన్ టర్నర్, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, దీపక్ హుడా, కె.గౌతమ్.
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభాసిమ్రాన్ సింగ్, రిలే రూసో, తనయ్ త్యాగరాజన్, విద్వాత్ కవీరప్ప, హర్‌ప్రీత్ భాటియా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..