
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఐపీఎల్ 17వ సీజన్లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రంగంలోకి దిగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. చెన్నైలోని చెపాక్ అంటే ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి KKR ఫైనల్లోకి ప్రవేశించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో అవకాశంలో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. మరి ఈ ఫైనల్ పోరులో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా మరియు వరుణ్ చక్రవర్తి.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రకాష్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, కేఎస్ భరత్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: పాట్ కమిన్స్ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..