IPL Auction 2024 Unsold Players: భారీ అంచనాలు.. కట్‌చేస్తే.. ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.. ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్లు వీరే..

|

Dec 19, 2023 | 7:11 PM

IPL 2024 Mini Auction Unsold Players: ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో.. కొంతమంది ప్లేయర్లు అమ్ముడు కాలేదు. ఎన్నో అంచనాలు ఉన్నా వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. మొత్తంగా 332 మంది క్రికెటర్లు పాల్గొన్న ఈ ఐపీఎల్ 2024 వేలంలో 77 స్లాట్‌లకు బిడ్‌లను ఆహ్వానించారు. ఈ వేలం దుబాయ్‌లోని కోకా కోలా ఎరీనాలో జరిగింది. అలాగే, అభిమానులు ఈవెంట్‌ను తొలిసారి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి.

IPL Auction 2024 Unsold Players: భారీ అంచనాలు.. కట్‌చేస్తే.. ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.. ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్లు వీరే..
IPL Auction 2024 Unsold Players
Follow us on

IPL Auction 2024 Unsold Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలంలో భారీ రికార్డులు నమోదయ్యాయి. వేలం మొదటి అర్ధభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రూ. 20.50 కోట్లకు అమ్ముదవ్వగా, ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు మిచెల్ స్టార్క్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈ క్రమంలో చాలామంది ఆటగాళ్లు అమ్ముడవ్వలేదు. వీరిపై అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిని చూపించలేదు. దీంతో వీరు అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

అమ్ముడవ్వని ఆటగాళ్ళు..

బ్యాటర్లు..

రిలీ రోసౌ – 2 కోట్లు

కరుణ్ నాయర్ – 50 లక్షలు

స్టీవ్ స్మిత్ – 2 కోట్లు

మనీష్ పాండే – 50 లక్షలు

రోహన్ కున్నుమ్మల్ – 20 లక్షలు

సౌరవ్ చుహాన్ – 20 లక్షలు

ప్రియాంష్ ఆర్య – 20 లక్షలు

మనన్ వోహ్రా – 20 లక్షలు

బౌలర్లు..

లాకీ ఫెర్గూసన్ – 2 కోట్లు

జోష్ హేజిల్‌వుడ్ – 2 కోట్లు

మహ్మద్ వకార్ సలాంఖైల్ – 50 లక్షలు

ఆదిల్ రషీద్ – 2 కోట్లు

అకేల్ హోసేన్ – 50 లక్షలు

ఇష్ సోధి – 75 లక్షలు

తబ్రైజ్ షమ్సీ – 50 లక్షలు

ముజీబ్ ఉర్ రెహమాన్ – 2 కోట్లు

కులదీప్ యాదవ్ – 20 లక్షలు

ఇషాన్ పోరెల్ – 20 లక్షలు

శివ సింగ్ – 20 లక్షలు

ముర్గన్ అశ్విన్ – 20 లక్షలు

పుల్కిత్ నారంగ్ – 20 లక్షలు

ఆల్ రౌండర్లు..

మొహమ్మద్ అర్షద్ ఖాన్ – 20 లక్షలు

సర్ఫరాజ్ ఖాన్ – 20 లక్షలు

రాజ్ అంగద్ బావా – 20 లక్షలు

వివ్రంత్ శర్మ – 20 లక్షలు

అతిత్ షెత్ – 20 లక్షలు

హృతిక్ షోకీన్ – 20 లక్షలు

వికెట్ కీపర్లు..

ఫిలిప్ సాల్ట్ – 1.50 కోట్లు

జోష్ ఇంగ్లీస్ – 2 కోట్లు

కుసాల్ మెండిస్ – 50 లక్షలు

ఉర్విల్ పటేల్ – 20 లక్షలు

విష్ణు సోలంకి – 20 లక్షలు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..