IPL 2024: టీ20రా పిల్లబచ్చా.! 50, 100 పరుగులు కాదు.. లెక్క తప్పితే కెరీర్ బొక్కే..

యావరేజ్ కన్నా టీ20ల్లో స్ట్రైక్‌రేటే చాలా ఇంపార్టెంట్.. ప్రత్యర్ధి జట్టు టార్గెట్ ఎంత ఇచ్చినప్పటికీ.. దాన్ని చేధించే క్రమంలో ఆఖర్లో చేసే చిన్న చిన్న క్యామియోలే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవల గుజరాత్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ చూసుకుంటే.. టైటాన్స్ గెలిచేందుకు..

IPL 2024: టీ20రా పిల్లబచ్చా.! 50, 100 పరుగులు కాదు.. లెక్క తప్పితే కెరీర్ బొక్కే..
Virat Kohli, Faf

Updated on: Apr 12, 2024 | 8:21 PM

యావరేజ్ కన్నా టీ20ల్లో స్ట్రైక్‌రేటే చాలా ఇంపార్టెంట్.. ప్రత్యర్ధి జట్టు టార్గెట్ ఎంత ఇచ్చినప్పటికీ.. దాన్ని చేధించే క్రమంలో ఆఖర్లో చేసే చిన్న చిన్న క్యామియోలే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవల గుజరాత్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ చూసుకుంటే.. టైటాన్స్ గెలిచేందుకు చివరి ఐదు ఓవర్లలో 75 పరుగులు కావాల్సి ఉండగా.. క్రికెట్ విశ్లేషకులు రాజస్తాన్ రాయల్స్ ఐదో విజయాన్ని అందుకుంటారని అందరూ భావించారు. అప్పటికే గిల్ 44 బంతుల్లో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ సమయంలో టైటాన్స్‌కు ఉన్నది కేవలం ఆల్‌రౌండర్లే. ఆ ఆల్‌రౌండర్లిద్దరూ 150 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో బంతిని బౌండరీని దాటించగలరు. కట్ చేస్తే.. రాహుల్ తెవాటియా 22(11), ఎస్‌ఆర్ 200, షారుక్ ఖాన్ 14(8), ఎస్‌ఆర్ 175, రషీద్ ఖాన్ 24(11), ఎస్‌ఆర్ 218.18. వీళ్లు చేసిన పరుగులు తక్కువే అయినప్పటికీ.. అదిరిపోయే క్యామియోలు.. జట్టును విజయం సాధించడంలో సహాయపడ్డాయి.

ఆదివారం వాంఖడేలో ముంబై, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ క్యామియోలే భారీ స్కోర్‌కి తోడ్పడ్డాయి. ఇక జైపూర్‌లో జరిగిన రాజస్తాన్, బెంగళూరు మ్యాచ్ చూస్తే.. ఆర్సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉన్న 120 బంతుల్లో 105 బంతులు వినియోగించుకుని.. గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ వంటి హిట్టర్లకు తక్కువ బంతులను ఇచ్చాడు. కట్ చేస్తే.. రాజస్తాన్ ఈ మ్యాచ్‌లో గెలిచింది. ఇదంతా పరిగణనలోకి తీసుకుంటే.. టీ20 క్రికెట్ అనేది 50, 100లు కాదు.. క్యామియోలే కీలక పాత్ర పోషిస్తాయి. ఇంపాక్ట్ సబ్ రూల్ కారణంగా జట్లకు అదనపు బ్యాటర్ లభించాడు. దీంతో ఆయా జట్లు స్కోర్‌ను 200 దాటించగలవు.