T20 World Cup 2024: పంత్, శాంసన్, రాహుల్, ఇషాన్.. టీ20 ప్రపంచకప్‌ వికెట్ కీపర్ రేసులో ఎవరు ముందున్నారంటే?

ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. కాబట్టి పొట్టి ప్రపంచకప్ లో సత్తా చాటేందుకు ఐపీఎల్ ఒక చక్కటి వేదిక. పైగా ఇక్కడ ఎంత మెరుగ్గా రాణిస్తే ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్‌ను ఆటపట్టించడం ద్వారా రోహిత్ శర్మ కూడా ఈ విషయాన్ని సూచించాడు.

T20 World Cup 2024: పంత్, శాంసన్, రాహుల్, ఇషాన్.. టీ20 ప్రపంచకప్‌ వికెట్ కీపర్ రేసులో ఎవరు ముందున్నారంటే?
Team India

Updated on: Apr 13, 2024 | 5:43 PM

ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. కాబట్టి పొట్టి ప్రపంచకప్ లో సత్తా చాటేందుకు ఐపీఎల్ ఒక చక్కటి వేదిక. పైగా ఇక్కడ ఎంత మెరుగ్గా రాణిస్తే ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్‌ను ఆటపట్టించడం ద్వారా రోహిత్ శర్మ కూడా ఈ విషయాన్ని సూచించాడు. అప్పటి నుంచి వికెట్‌కీపర్‌ల విషయంలో చర్చలు మొదలయ్యాయి. టీమిండియా తరఫున ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మలు వికెట్ కీపర్ ఎంపికలుగా అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఐపిఎల్‌ను విశ్లేషిస్తూ, ప్రస్తుతం ప్రపంచ కప్ రేసులో ఏ వికెట్ కీపర్ ముందంజలో ఉన్నాడో చెప్పాడు.

రిషభ్ పంత్..

కాగా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ స్థానం దాదాపు ఖాయమైంది. రాబోయే ఐపీఎల్‌లో మ్యాఉల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే పంత్ టీ20 ప్రపంచకప్‌ ఆడడం ఖాయం. ఇప్పుడు ఇదే విషయంపై ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. పంత్‌ను ప్రపంచకప్ జట్టులో చూడాలని కోరుకుంటున్నానన్నాడు. పంత్‌తో పాటు సంజూ శాంసన్‌ను జట్టులో కొనసాగించడంపై కూడా మాట్లాడాడు గిల్ క్రిస్ట్.

ఇవి కూడా చదవండి

 

రిషబ్ పంత్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 153 పరుగులు చేసాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ (154) కూడా అద్భుతంగా ఉంది. ఘోరమైన ప్రమాదం నుండి తిరిగి వచ్చిన తర్వాత అతను చేసిన బ్యాటింగ్ మరియు కీపింగ్ కారణంగా పంత్‌కు చాలా మద్దతు లభిస్తోంది. ఇది కాకుండా, గాయానికి ముందు పంత్ ఆడిన కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ప్రపంచకప్ రేసులో అతనిని ముందు వరుసలో నిలబెట్టాయి.

శాంసన్, కిషాన్ కూడా..

పంత్ తర్వాతి ప్లేసులో సంజూ శాంసన్ ఉన్నాడు. అతను 5 IPL మ్యాచ్‌లలో 82 సగటు, 157 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. క్రమశిక్షణ విషయంతో వివాదాల్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా రేసులో ఉన్నాడు. అయితే ఇప్పటివరకు అతను 5 మ్యాచ్‌లలో 32 సగటుతో 161 పరుగులు చేశాడు. అయితే ఇషాన్ 183 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుండడం ప్లస్ పాయింట్. ఇటీవల అతడిని ప్రపంచకప్ జట్టు ఎంపిక గురించి అడిగారు. ప్రస్తుతం ఎంపిక గురించి ఆలోచించడం లేదని కిషన్ చెప్పాడు. నా ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

 రాహుల్ కూడా రేసులోనే కానీ..

ప్రదర్శన పరంగా కేఎల్ రాహుల్ చివరి స్థానంలో నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో రాహుల్ 4 మ్యాచ్‌ల్లో 126 పరుగులు చేశాడు. సగటు 31.50 స్ట్రైక్ రేట్ 128. ప్రదర్శన పరంగా రాహుల్ చాలా వెనుకబడి ఉన్నాడు. కానీ అతనికి ప్రపంచకప్ వంటి పెద్ద ఈవెంట్లలో ఆడిన అనుభవం ఉంది. అది అతనికి ప్రయోజనం చేకూరుస్తుంది. రాహుల్‌తో పాటు జితేష్ శర్మ కూడా వికెట్ కీపర్ రేసులో ఉన్నాడు. కానీ ఐపీఎల్ లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..