Video: ఇలాంటి క్యాచ్‌లు నెవ్వర్ భిపోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఐపీఎల్ 2023లోనే అత్యుత్తమం.. రోమాలు నిక్కబొడవాల్సిందే..

|

May 23, 2023 | 5:47 PM

IPL 2023లో భాగంగా లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ నడుస్తున్నాయి. తొలి ప్లేఆఫ్స్‌లో నేడు (మే 23) గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది.

Video: ఇలాంటి క్యాచ్‌లు నెవ్వర్ భిపోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఐపీఎల్ 2023లోనే అత్యుత్తమం.. రోమాలు నిక్కబొడవాల్సిందే..
Ipl 2023 Best Catches
Follow us on

IPL 2023లో భాగంగా లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ నడుస్తున్నాయి. తొలి ప్లేఆఫ్స్‌లో నేడు (మే 23) గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు ప్రేక్షకులు చూశారు. ఈ క్రమంలో వీక్ 7లో అద్భుతమైన క్యాచ్‌లను ఐపీఎల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవేంటో ఓసారి లుక్కేయండి..

కాగా, నేటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మే 28న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎలిమినేటర్..

దీని తర్వాత గురువారం తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ప్రయాణం ఈ లీగ్‌లోనే ముగుస్తుంది. కాగా, గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో తలపడుతుంది.

క్వాలిఫైయర్-2..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్‌లో ఆడే అవకాశం ఉంటుంది.

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..