Virat Kohli: ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కంటే ముందు నుంచే సూపర్ ఫామ్ కనబరుస్తున్న విరాట్ ‘కింగ్’ కోహ్లీ.. ఇప్పుడు లీగ్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’గా నిలిచాడు. ఈ రోజు జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై తను 12వ రన్‌తో ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్న ఆ మ్యాచ్‌కి ముందు కోహ్లీ 232 మ్యాచ్‌ల్లో 6988 పరుగులు చేశాడు. కోహ్లీ లిఖించిన మరో రికార్డు ఏమిటంటే.. ఒకే టీమ్ తరఫున 7000 పరుగులు చేయడం. ఐపీఎల్ ఆరంభ సీజన్ అంటే 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మాత్రమే ఆడుతున్న కోహ్లీ నేటితో 7000 పరుగులు చేశాడు. ఇంకా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో కూడా కింగ్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు.
అయితే కోహ్లీ చేసిన ఈ 7 వేల పైచిలుకు పరుగులలో 5 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 129.53, ఇంకా 36.65 యావరేజ్‌ని కూడా కలిగి ఉన్నాడు. మరోవైపు కోహ్లీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్(6,536) రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (6189), రోహిత్ శర్మ (6063) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
7⃣0⃣0⃣0⃣ ??? ???? ??? ???? ?????! ?@imVkohli becomes the first batter to surpass this milestone in IPL ?
TAKE. A. BOW ?#TATAIPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/VP4dMvLTwY
— IndianPremierLeague (@IPL) May 6, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..